*నూతన ఓటర్లకు ఓటరు (ఎపిక్) కార్డులు అంద చేయాలి:: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్*

ప్రచురణార్థం—-2

తేదీ.12.1.2022

*నూతన ఓటర్లకు ఓటరు (ఎపిక్) కార్డులు అంద చేయాలి:: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్*

నూతనంగా ఓటరు జాబితాలో నమోదు చేసిన ఓటర్లకు ఓటరు (ఎపిక్) కార్డులు జాతీయ ఓటరు దినోత్సవం తేదీ 25.1.22 నాడు అంద చేయాలని చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ ఓటరు దినోత్సవం, నూతన ఓటరు జాబితా, తదితర అంశాలపై బుధవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జనవరి 5న తుది ఓటరు జాబితా రూపొందించామని, అందులో 18 సంవత్సరాలు నిండిన నూతనంగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు జాతీయ ఓటరు దినోత్సవం నాడు నూతన ఓటర్ ఏ.పిక్ కార్డులను మరియు కిట్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మించి ప్రారంభించుకున్న ఈ విఎం గోదాంలలోకి ఈ వి ఎంలు (బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లు )లను వారం లోగా తరలించాలని తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం ను కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహణ పై ఆయన అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, డి రమాదేవి సిబ్బంది ఈ వీసి లో పాల్గొన్నారు.
………………………………………

 

Share This Post