బోధన్ మున్సిపాలిటీ పరిధిలో హరితహరం కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అంబం గేట్ వద్ద రహదారికి ఇరువైపులా అవెన్యు ప్లాంటేషన్ ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ఈ రోజు నుంచి జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వే ను వార్డ్ నెంబర్ 2 మరియు 20 లలో సందర్శించారు. సర్వే జరుగుతున్న తీరును ఆశా కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు.. వారు 70 కుటుంబల్లో చేస్తే ఇద్దరికీ లక్షణాలు ఉంటే కోవిద్ కిట్ ఇవ్వడం జరిగందని ఆశా కార్యకర్తలు కలెక్టర్ గారికి తెలిపారు. వార్డ్ 10 లో వైకుంఠదామన్ని సందర్శించారు.. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్ రావు గారు, ఎమ్మార్వో గఫర్ గారు , కమిషనర్ రామలింగం, డిప్యూటీ శివానందం, ఏఈ లు శివ కృష్ణ, శ్రీనివాస్, మెప్మ శ్రీనివాస్ పాల్గొన్నారు

Share This Post