7- కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి :రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

7- కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి

రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓ లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహణ

ఈ నెల 10వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ కళాశాలలోనే
000000

7- కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10వ తేదీన జరగనున్న పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై కరీంనగర్ జిల్లాలోని అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ నిర్వహణ పకడ్బందీగా, సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. 7- కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 1.కరీంనగర్ లోని జడ్పీ కార్యాలయం, 2. హుజరాబాద్, 3. జగిత్యాల, 4. కోరుట్ల, 5. పెద్దపల్లి, 6. మంథని, 7. హుస్నాబాద్ ల లోని ఎంపీడీవో కార్యాలయాల్లో, 8. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జడ్పీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సుమారుగా 200 వరకు ఓటర్లు ఉంటారని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు ఓటర్లుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. సంతకం చేయ రానీ, వేలి ముద్ర వేసే ఓటర్లు ఉంటే ఓటు వేసేందుకు సహాయకుల కోసం మూడు రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఓటర్లు బ్యాలెట్ పేపర్ పై పోలింగ్ అధికారి అందజేసే వాయిలెట్ పెన్ తో మాత్రమే అంకెలను ప్రాధాన్యత క్రమంలో వేసేలా వారికి చెప్పాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫాయిల్ పై ఓటర్ సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారులు పిఓ డైరీలు రాసేలా చూడాలని కలెక్టర్ అన్నారు. పోలింగ్ కేంద్రాలలో షామియానాలు , తాగునీరు, లైటింగ్, ర్యాంపులు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, మెడికల్ టీం ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ఓటర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని, వరుసలో ఆరు ఫీట్ల భౌతిక దూరం పాటిస్తూ నిలుచునేందుకు మార్కింగ్ చేయాలని సూచించారు. ఓటర్లు ఓటు వేసేందుకు గాను డిస్పోజబుల్ గ్లోవ్స్ ఇవ్వాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో కి ఓటర్లు సెల్ఫోన్లను తీసుకు రాకుండా చూడాలని సూచించారు. సెల్ ఫోన్లు బయటనే ఉంచేందుకు ఒక వ్యక్తిని ఉంచాలన్నారు. కోవిడ్ పేషెంట్లు అయిన ఓటర్లు ఉంటే వారికి 3 గంటల నుంచి 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ లు, జడ్పీ సీఈవోలు, మున్సిపల్ కమిషనర్లు, కరీంనగర్ జడ్ పి సి ఈ ఓ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post