7.9.2021 బాల బాలికల రక్షణే కాకుండా వారి హక్కులను కూడా కాపాడటం అతి ముఖ్యమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు శ్రీమతి అపర్ణ తెలిపారు.

Press note. 7.9.2021

బాల బాలికల రక్షణే కాకుండా వారి హక్కులను కూడా కాపాడటం అతి ముఖ్యమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు శ్రీమతి అపర్ణ తెలిపారు.

మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడిన బాలల హక్కులపై సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, బాలల హక్కుల కోసం 2019 సంవత్సరంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు జరిగిందని తెలిపారు. బాలల హక్కులకు భంగం, అఘాయిత్యాలపై ఫిర్యాదుల రూపంలోనే కాకుండా సుమోటోగా కూడా తీసుకొని వారికి రక్షణగా నిలవడం జరుగుతున్నదని తెలిపారు. గత ఫిబ్రవరి మాసం నుండి బాల అదాలత్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా అనాధలైన బాలబాలికలను సంరక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తొమ్మిది మంది మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనాధ పిల్లలను గుర్తించి కాపాడాలని, వసతి, విద్య కల్పించాలని, ప్రతి ఒక్క చైల్డ్ ను రక్షించడమే కమిషన్ ముఖ్య ఉద్దేశమని, ఏ ఒక్కరు కూడా వదిలివేయబడవద్దని అన్నారు. కామారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీలలో అంగన్వాడీ సిబ్బంది బాలలను చక్కగా చూస్తున్నారని, ఆహారం మందుల పర్యవేక్షణ బాగుందని అన్నారు. ఈ సెప్టెంబర్ మాసంలో పోషన్ అభియాన్ క్రింద అంగన్వాడీలలో మొక్కలు నాటేలా చూడాలని, తద్వారా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. ఫోక్సో కేసులకు సంబంధించి పోలీసు శాఖ పనితీరు బాగుందని, శిక్షలు పడేలా చేస్తున్నారని అన్నారు. ఫోక్సో కేసులలో బాధితులకు నష్టపరిహారం సకాలంలో అందేలా చూడాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు హెల్త్ క్యాంపులు ఎక్కువగా కండెక్ట్ చేసి చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. బాలలకు సంబంధించి ఆధార్ కార్డులు వెంటనే జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, దివ్యాంగులు ఉన్నట్లయితే వీల్ చైర్స్, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలకు సంబంధించి జిల్లాలో 153 వివాహాలను అధికారులు ఆపడం సంతోషించదగ్గ విషయమని, బాల్య వివాహాలను ఆపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి గ్రామస్థాయి నుండి అవగాహన పెంపొందించేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. బాలల సంరక్షణకు సంబంధించి అన్ని సంక్షేమ విభాగాలు సమన్వయంతో తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ప్రతి జనవరి మాసంలో జరిగే ఆపరేషన్ స్మైల్, జూలై మాసంలో జరిగే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ద్వారా అనాధలను, బాల కార్మికులను గుర్తించడం, వారికి చదువు, వసతి సౌకర్యాల కల్పన, తప్పిపోయిన పిల్లలకు సంబంధించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం వంటి పనులను అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని, భవిష్యత్తులో బాలల రెస్క్యూ గృహాలలో ఎవరూ ఉండకుండా ఉండేలా పని చేయాలని తెలిపారు. కోవిడ్ వలన పాక్షిక అనాథలైన పిల్లలకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ మాట్లాడుతూ, బాలల సంరక్షణ, వారి హక్కులను కాపాడడం అతి ముఖ్యమైన విషయాలని, ఐసిడిఎస్ శాఖతో లైన్ డిపార్ట్మెంట్స్ అయిన పోలీసు, రెవెన్యూ, ఎస్.సి., ఎస్.టి., బీసీ., మైనారిటీ సంక్షేమ శాఖలు సమన్వయంతో బాలల సంక్షేమం కోసం పని చేయాలని సూచించారు. జిల్లాలో 175 గ్రామ పంచాయతీలలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. బాధితులకు నష్ట పరిహారం ఇప్పించడం, బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కలిగించడం‌, బాల్య వివాహ వ్యవస్థను రూపుమాపడం కమిటీ ముఖ్య బాధ్యతలని తెలిపారు. బాలల హక్కులలో అతి ముఖ్యమైన హక్కు విద్యా హక్కు అని, విద్య చాలా ముఖ్యమని, దీని గురించి అధికారులు క్షేత్రస్థాయిలో శ్రద్ధ కనబరచాలని అన్నారు. మహిళా సమాఖ్యలు, మెప్మా గ్రూపు మహిళలు పోషన్ అభియాన్ కింద మాతా శిశువుల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. బాలల హక్కులకు ఎవరు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి సరస్వతి మాట్లాడుతూ, బాల్య వివాహాల వలన జరిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కోవిద్ వలన పాక్షికంగా అనాథలైన 14 మందికి పిల్లలకు నెలకు రెండు వేల చొప్పున, అంతేకాకుండా నిత్యావసర సరుకులు అందించడం జరుగుతున్నదని, వారి సంరక్షణలో భాగంగా మొబైల్ ఫోన్ కూడా అందించడం జరిగిందని, అత్యవసర నెంబర్లు ఉంటాయని తెలిపారు. ఈ 14 మంది సంరక్షణ కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందని తెలిపారు. 87 మంది పాక్షికంగా అనాధలైన బాలికలకు హైదరాబాదు లోని దుర్గాబాయి దేశ్ముఖ్ సాంకేతిక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సుకు ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. బాల బాలికల సంరక్షణ పట్ల ప్రభుత్వ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తున్నట్లు తెలిపారు. బాలల హక్కులు, రక్షణ పట్ల జిల్లా ఎస్పీ గారు అన్ని విధాల భరోసా కల్పించారని తెలిపారు.

బాలల హక్కుల పట్ల రూపొందించిన పుస్తకాలను ఈ సందర్భంగా విడుదల చేశారు.

సమీక్షా కార్యక్రమంలో జిల్లా ఆదనపు పోలీసు సూపరింటెండెంట్ అన్యోన్య, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ కె.సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కోఆర్డినేటర్ డాక్టర్ అజయ్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, జిల్లా శాఖ అధికారి రాజు, జిల్లా బి.సి.సంక్షేమ అధికారి శ్రీనివాస్, షీ టీం పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, సి డి పి వో లు, అధికారులు పాల్గొన్నారు.

….DPRO. KMR

Share This Post