72 వ సాయుధ దళముల పరాక దినోత్సవమును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.  మాజీ సైనికుల సమక్షములో  జిల్లా కలెక్టర్  అనుదీప్  సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  సునీల్ దత్ మరియు ఇతర రెవిన్యూ సిబ్బందికి స్టిక్కర్లను అతికించి విరాళములను సేకరించినారు

. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్  అనుదీప్  మాట్లాడుతూ సైనిక, నావిక మరియు వైమానిక దళములలో  అసువులు బాసిన సమరయోధుల త్యాగనిరతికి, దైర్య సాహసములకు, దేశ భక్తికి జోహార్లు అర్పించారు. వారి సేవలకు గుర్తుగా దేశ రక్షణకు నిరంతరము సేవ చేయుచున్న త్రివిధ దళములను ఉత్తేజ పరచే ఉద్దేశ్యముతో ఈ పతాక దినోత్సవమును గత 72 సంవత్సరములుగా జరుపుతున్నామని  చెప్పారు. దేశ శాంతి భద్రతలను కాపాదుటలో, యుద్ధ సమయాల్లోనూ, దేశ రక్షణలోనూ, ప్రకృతి విపత్తులలో మన సాయుధ ‘దళములు చేయుచున్న సేవలు మరువలేనివని చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ పవిత్ర కార్యక్రమంలో  పాలు పంచుకొని దేశ భక్తిని చాటుకోవాలని చెప్పారు. ప్రకృతి విపత్తులలో,  దేశ రక్షణే ప్రధమ ధ్యేయముగా పెట్టుకొని విధి నిర్వహణలో అసువులు బాసిన, వికలాంగులైన వీర యోధుల కుటుంబాలకు, మాజీ సైనికులకు, దేశ ప్రజలందరూ ఎంతో ఋణపడి ఉన్నారని చెప్పారు. వారికి చేయూతనిచ్చి, వారి సంక్షేమ, పునరావాసాలకు, పాటుపడుట మనందరి కర్తవ్యమని చెప్పారు.  ఈ కార్య నిర్వహణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను చేపట్టాయని,  అయితే  ప్రభుత్వ కృషితో పాటు  ప్రజల సహాయ సహకారములు కూడా ఎంతో అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేకరించిన విరాళాలను పతాక దినోత్సవ నిధికి జమ చేయడం జరుగుతుందని చెప్పారు. వచ్చిన విరాళములను మాతృ దేశ రక్షణలో అసువులు బాసిన మరియు వికలాంగులైన వీరయోధులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల పునరావాస కార్యక్రమములకై వినియోగించబడునని ఆయన పేర్కొన్నారు.స్వచ్చంద విరాళములకు ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు, ఆర్ధిక మంత్రిత్వ శాఖ వారి ఉత్తర్వుల ప్రకారం మినహాయింపు ఉంటుందని చెప్పారు. ప్రజలు, సినిమా, పరిశ్రమల యజమానులు, వ్యాపార వర్గాల ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందముగా విరాళములు ఇవ్వవలసినదిగా మరియు మీ వద్దకు వచ్చే పిల్లలకు, మాజీ సైనికులకు, ఎన్.సి.సి. కాడేట్ లకు సహకరించి హుండీ టాక్స్ ల లోను, స్టిక్కర్లు, కార్ ఫ్లాగ్ ల ద్వారా విరివిగా విరాళములను ఇవ్వవలసినదిగా ఆయన కోరారు. మనందరి స్వచ్చంద విరాళములను సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారి పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ ను నేరుగా గాని, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి వారి కార్యాలయము, ఖమ్మం నకు గాని పంపవచ్చునని ఆయన తెలిపారు.   తదుపరి ఈ కార్యక్రమ నిర్వహణ భాద్యత వహించిన భద్రాద్రి కొత్తగూడెం మాజీ సైనిక సంక్షేమ సంఘ బాధ్యులు నాగేశ్వర రావు, శేషుబాబు, డాంగి, లక్ష్మయ్య, మొహిద్దిన్, ఇస్సాక్, బాషా, నూతన్ బాబు, చలపతి రావులను కలెక్టర్ అభినందించారు.

Share This Post