73 వ. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, జిల్లా ఎస్పీ అపూర్వ రావు

పత్రికా ప్రకటన        26.01.2022, వనపర్తి.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 73 వ. గణతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకలను నిరాడంబరంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, జిల్లా ఎస్పీ అపూర్వ రావుతో కలిసి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్, జిల్లా ఎస్పి అపూర్వ రావు, అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, రమేష్, కోళ్ల వెంకటేష్, అడ్వకేట్ బక్షి చంద్రశేఖర రావు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
____
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post