74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హనుమకొండ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవవందనంస్వీకరించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు సీపీ కలెక్టర్ ప్రశంసాపత్రాలు బహూకరించారు.స్వతంత్ర సమర యోధులకు సన్మానం చేసారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, cp av. రంగనాథ్,droవసూచంద్ర,జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
——————————————————————–