74 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అత్యంత ఘన౦గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

పత్రిక ప్రకటన                                                                 తేది : 21-01-2023

 

74 వ భారత  గణతంత్ర  దినోత్సవ వేడుకలను  పండుగ  వాతావరణంలో   అత్యంత ఘన౦గా నిర్వహించేందుకు ఏర్పాట్లు  చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు  ఈనెల 26 న స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. వేడుకలలో అధికారులకు కేటాయించిన విధులు పక్కాగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పెరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ డిఆర్డిఎ, అటవీ, హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఎస్సీ కార్పొరేషన్, శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ జెండా  ఏర్పాటు, ప్రోటోకాల్ ప్రకారం వి ఐ పి కుర్చీలు,టెంట్లు,  వేదిక అలంకరణ, సీటింగ్ ఏర్పాట్లు, తాగునీరు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ,  . ప్రోటోకాల్ మేరకు ఆహ్వాన పత్రికలు పంపిణీ తదితరం అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇవ్వాలన్నారు. పోలీస్ పెరేడ్ మైదానంలో షామియానా, కుర్చీలు, బారికేడింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించాలని తహశీల్దార్,ఆర్ డి ఓ కు ఆదేశించారు. మొబైల్ టైలెట్స్  ఏర్పాటు చేయాలనీ , విద్యార్థులచే  నిర్వహించే  సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనీ అధికారులకు   ఆదేశించారు.

అనంతరం నెల   25 న జరిగే జాతీయ  ఓటర్ల దినోత్సవం సందర్బంగా అన్ని పాటాశాలలో, కళాశాలలో  విద్యార్థులచే ప్రతిజ్ఞ చెయిo చాలని,  విద్యార్థులకు  ఎస్ ఏ రైటింగ్  పోటీలు నిర్వహించాలని, పోటిలో గెలుపొందిన వారికీ బహుమతులు ప్రదానం చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతి, పోలింగ్  పి ఎస్ లో బి ఎల్ ఓ లు  ఓటర్ల దినోత్సవం ర్యాలి లు నిర్వహించాలని,  సాంగ్ రిలీజ్ అవుతుందని, మున్సిపాల్టి పరిదిలో , సోషల్ మీడియా లో ప్లే  చేయాల్సి ఉంటుందని  అన్నారు.

ఈ సమావేశం లో  అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ , జాడ్ పి సి ఇ ఓ విజయ నాయక్, డి ఆర్ డి ఏ ఉమాదేవి,  ఆర్డిఓ రాములు , జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారిచే జారి చేయబడినది.

 

Share This Post