ప్రతీ ఉద్యోగి తమ విధుల పట్ల అప్రమత్తత, అకింతభావంతో ఉండి విధులు నిర్వహించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ కోరారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో ఘనంగా జరిగాయి. పీసీసీఎఫ్ శోభ, అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అటవీ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తోందని, ప్రభుత్వ ప్రోత్సాహం, ఉద్యోగుల పట్టుదలతోనే ఇది సాధ్యమైందని ఆమె అన్నారు. గత యేడాది కాలంగా విధుల్లో ప్రతిభ కనపరుస్తున్న 75 మంది అటవీ శాఖ ఉద్యోగులను ప్రశంసా ప్రతం, నగదు పురస్కారంతో సత్కరించారు. అరణ్య భవన్ లో జరిగిన ఈ వేడుకల్లో మహారాష్ట్ర పీసీసీఎఫ్ (ఐ.టీ) కొండల్ రావు, రిటైర్డ్ పీసీసీఎఫ్ రాంబాబు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ (ఎస్.ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.