75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు స్థానిక కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా జరిగాయి .
ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా వరంగల్ zp చైర్ పర్సన్ గండ్ర జ్యోతి హజరయ్యి జాతీయ జెండా ను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం ను స్వీకరించారు .
అనంతరం జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన సంక్షేమ పథకాలకు సంబందించిన ప్రగతిని జిల్లా ప్రజలకి తెలియజేసారు.
ప్రసంగం అనంతరం 25 కోట్ల బ్యాంకు లింకేజ్ , 56 కోట్ల 60 లక్షల రుణ మాఫీ చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
అలాగే రాష్ట్ర ఇన్నోవేషన్ సేల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం లో ఎంపిక అయిన జిల్లా ఆవిష్కర్తల కు,
విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలను అందించిన ఉద్యోగులకు ముఖ్య అతిధి, కలెక్టర్ హరిత చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందచేశారు.
రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ప్రారంభించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఎంపిక అయిన ఆవిష్కరణ లకు సంబందించిన స్టాళ్ళను ముఖ్య అతిధి, కలెక్టర్ వీక్షించి ఆవిష్కర్తలను అభినందించారు.
నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరాన్ని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, అదనపు కలెక్టర్ హరి సింగ్, zp ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, వివిధ శాఖ లకు సంబందించిన జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.