75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

పత్రికా ప్రకటన తేది:15.8.2021
వనపర్తి.

ఎందరో మహానుభావులు త్యాగ ఫలితం వల్ల ఏర్పడ్డ స్వాతంత్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని త్యాగధనుల త్యాగాలను ఎప్పటికీ మరువరాదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేరే ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు విద్య ,వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ధరణి, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, మత్స్యశాఖ తదితర శాఖల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుచున్న కార్యక్రమాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అట్టడుగు వర్గాలను ఆర్థికపరంగా అభివృద్ధి చేసి సమాజంలో గౌరవ స్థానం కల్పించాలన్న ఉద్దేశ్యంతో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గతంలో 25 వేల లోపు పంట రుణాలు తీసుకున్న వారికి ఋ ణ మాఫీ చేయగా రేపటి నుండి 50 వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఋణ మాపీ చేయనున్నాము. దశల వారిగా లక్ష రూపాయల లోపు ఋణ మాఫీ చేయనున్నామని అన్నారు. జిల్లాలో అర్హులైన లభ్దిదారులకు ఆహార భద్రతా కార్డులు అందజేసి, నెలకు 10 కిలోల బియ్యం అందిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతి నెల పెన్షన్లు అందజేస్తున్నామని, ప్రభుత్వం ఇటీవల 57 సంవత్సరాలు నిండిన నిరుపేదలకు పెన్షన్లు అందించాలని నిర్ణయించిందని అందుకనుగుణంగా లభ్దిదారుల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
గత మాసంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తో పాటు హరితా హారం కార్యక్రమం చేపట్టి పారిశుద్యం, పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టామని తద్వారా గ్రామాల రూపురేఖలే మారుతున్నయన్నారు. పల్లెల అభివృధికి గాను గ్రామా పంచాయితీలకు నేరుగా నిధులు అందజేశామని, మునిసిపల్ పట్టణ ప్రాంతాల అభివృద్ధికి, సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హరిత హారం క్రింద జిల్లాలో 26 లక్షల 78 వేల 800 మొక్కలు నాటే లక్ష్యానికి గాను 91% 24 లక్షల 37 వేల 693 మొక్కలు నాటడం జరిగిందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో అసంక్రమిత వ్యాధుల (NCD) పథకము లో భాగంగా 35 సంవత్సరాలు దాటిన రెండు లక్షల 58 వేల 788 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో ఒక లక్ష 21 వేల 732 మందికి రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నట్లు గుర్తించి, వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.
జిల్లాలో పంట రుణమాఫీ పథకం కింద 50 వేల రూపాయల లోపు రుణం తీసుకున్న 13 వేల 879 మంది రైతులకు 47 కోట్ల 92 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని ఆయన సూచించారు.
జిల్లాలో 30 కోట్ల రూపాయల వ్యయంతో 61వేల 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 12 వ్యవసాయ మార్కెట్ గోదాముల నిర్మాణం నాబార్డు పథకం కింద చేపట్టడం జరిగిందని మంత్రి వివరించారు.
వనపర్తి జిల్లాలోని రాజాపేట దగ్గర గొర్రెల పెంపకం, పరిశోధనా క్షేత్రం మంజూరైనట్లు త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
జిల్లాలో స్త్రీ నిధి బ్యాంకు ద్వారా స్వయం సహాయాక బృందాలకు రుణాలు, బ్యాంకు లింకేజి ద్వారా సంఘాలకు రుణాలు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు.
కరోనా కట్టడిలో భాగంగా జిల్లాలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కోవిడ్ టీకాలు వేశామని, సీజనల వ్యాధులు ప్రభలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ టి.ఎస్. ఐ పాస్. క్రింద పలు రాయితీలు ఇస్తున్నదని తద్వారా పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి అన్నారు.
అనంతరం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాటశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలను తిలకించి బాలలను అభినందించారు. డి.ఆర్.డి.ఏ, ఉద్యాన, ఇంటింటా ఇన్నోవేషన్ ఎక్సిబిషన్ 2021, మహిళ.శిశు సంక్షేమ శాఖదివ్యంగులకు సహాయ పరికరాలు పంపిణీ మరియు వైద్య ఆరోగ్య శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను మంత్రి తిలకించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల లో అంకితభావంతో పనిచేసిన అధికారులకు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ అపూర్వ రావు, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, (లోకల్ బాడీ) అంకిత్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post