75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రక్తదాన శిబిరం .

75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నెహ్రూ యువకేంద్ర వరంగల్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు కాకతీయ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ దేశ యువత ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆపద సమయంలో ఉన్న రోగులకు రక్తాన్ని దానం చేయడానికి ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఎం హరిత మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75సంవత్సరాలు అవుతున్న సందర్భంగా యువతీ యువకులు ముందుకు వచ్చి దేశ పునర్నిర్మాణంలో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు డాక్టర్ ఆకులపల్లి మధు, మండల పరశురాములు, నెహ్రు యువజన కేంద్రం అధికారి అన్వేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ హరిసింగ్, డిసిపి వెంకటలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి వసుధ, డిస్టిక్ చైల్డ్ protection ఆఫీసర్ మహేందర్ రెడ్డి , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్, నర్సంపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి కాకతీయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యస్. గణపతి రావు, ఇండియన్ redcross మెడికల్ ఆఫీసర్ దేవదాసు, ఇ.వి.శ్రీనివాసరావు, డాక్టర్ ఖాజా, సిబ్బంది, మరియు ఇతర ప్రభుత్వ అధికారులు సిబ్బంది యువతీ యువకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అత్యధిక సార్లు రక్తదానం చేసిన స్విమ్మర్ రాజును ఘనంగా సన్మానించడం జరిగింది. Nyk volunteers భారత్, మృణాళిని, cisf కానిస్టేబుల్ వైనాల రమేష్ లు పాల్గొన్నారు .

Share This Post