75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమావేశం : జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్

పత్రికా ప్రకటన                         తేది:10.8.2021. వనపర్తి.
75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అందరు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జయప్రద్రం చేయాలని ఆయన సూచించారు.ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు రావలసి ఉన్నాయని, అంతకంటే ముందుగా ఏర్పాట్లపై అందరు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు.

ఆగస్టు 15 వేడుకలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుటకు ఏర్పాటు చేయవలసిందిగా ఆయన అధికారులకు సూచించారు. వేడుకలకు వచ్చే అతిథికి పొలిసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పొలిసు బందోబస్త్ ఏర్పాట్లు, ప్రోటోకాల్ పాటించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) కి సూచించారు. ఆ రోజు పట్టణమంతా శుభ్రంగా ఉండేలా చూడాలని, రోడ్ల వెంట ముళ్ల పొదలను తొలగించాలని, మైదానంలో వాటరింగ్ చేయాలని మునిసిపల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డికి సూచించారు. పలు రంగుల పూలతో డయాస్ ను అందంగా అలంకరించాలని ఉద్యాన శాఖ అధికారి ఎం సురేష్, అటవీశాఖ అధికారి రామకృష్ణలకు సూచించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ముఖ్య అతిథికి జిల్లాలో జరుగుచున్న అభివృద్ధి పనులపై ప్రసంగం రూపొందించవలసినదిగా ముఖ్య ప్రణాళిఖాధికారిని, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటయు చేయవలసినదిగా ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం అతిధులను ఆహ్వానించాలని , ఇన్విటేషన్ కార్డు రూపొందించాలని, ఓవరాల్ గా అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన పనులను పూర్తి చేసేలా, వేడుకలు విజయవంతంగా నిర్వహించేలా అధికార్లకు సూచించారు. చెక్కుల పంపిణీ చేయవలసిందిగా డి డబ్ల్యూ ఓ పుష్పలత కు సూచించారు.
ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందచేయుటకు గాను ప్రతి శాఖ నుండి ఇద్దరిని ఎంపిక చేసి 11వ తేదీ సాయంత్రం లోపల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపవలసిందిగా అదనపు కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో చక్కటి ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఇచ్చుటకు అన్ని శాఖల అధికారుల నుండి వివరాలు తెప్పించుకొని సిద్ధంగా ఉండవలసినదిగా సూచించారు.
ఈ సమావేశంలో కలెక్టరేట్ తహసిల్దార్ రమేష్ రెడ్డి, డిపి& హెచ్ వో రవిశంకర్, డి ఆర్ డి ఓ నరసింహులు, సి పి ఓ వెంకటరమణ, డీఐ ఈ వో రవీందర్, డీఎఫ్ఓ రామకృష్ణ, డి డబ్ల్యూ ఓ పుష్పలత, డి ఐ ఈ వో జాకైర్
ఎమ్మార్వో రాజేందర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
——————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post