ఆగస్టు 15న 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నూతన జిల్లా కలెక్టర్ యం.మనూ చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు కలెక్టరేట్లోని తన చాంబర్లో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై తీసుకోవలసిన చర్యలను శాఖల వారీగా ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..
75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పతాకావిష్కరణ భావించేందుకు ముఖ్యఅతిథి గా ప్రభుత్వ విప్ అచ్చంపేట్ శాసనసభ్యులు గువ్వల బాలరాజ్ గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు.
ముఖ్యఅతిథి సమక్షంలో నాగర్ కర్నూలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం ఉద్యానవనం, వైద్య ఆరోగ్య, అటవీ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖల ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హార్టికల్చర్, పల్లె ప్రగతి, ఆరోగ్యం, ఐ సి డి ఎస్, విద్యా, డిఆర్డిఏ, సంక్షేమ, పశుసంవర్ధక ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు స్టాళ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
విద్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఐదు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అత్యుత్తమ సేవలందించిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు సైతం ఉత్తమ ప్రశంసాపత్రాలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఆయా శాఖలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు ఉత్తమ ఉద్యోగస్తుల పేర్ల వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.
అదేవిధంగా ప్రతి మండలానికి 3 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులకు ఉత్తమ ప్రశంసా పత్రాలను అందించేలా ఎంపిక చేయాలని డిపిఓను ఆదేశించారు.
ముఖ్యఅతిథి ప్రసంగం పాఠాన్ని పూర్తి చేయాలని సిపిఓను ఆదేశించారు.
అన్ని ఏర్పాట్లు శనివారం సాయంత్రం లోగా పూర్తి చేయాలన్నారు.
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను తూచా తప్పక అమలు పరచాలి అన్నారు.
పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు, బందోబస్తు, తదితర అంశాలపై పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా అన్ని శాఖలకు చెందిన శాఖలకు సంబంధించిన కోర్టు కేసులు, లోకాయుక్త, ఆర్టీఐ తదితర కేసుల వివరాల తేదీలను ఒకరోజు ముందుగానే వాటికి సంబంధించిన పూర్తి స్థాయి సమగ్ర నివేదికలను తనకు తెలియపరచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, డీఈవో గోవిందరాజులు, డిఆర్డిఓ నర్సింగ్ రావు, డిపిఓ రాజేశ్వరి, జిల్లా అధికారులు అనిల్ ప్రకాష్, రమాదేవి, రామ్ లాల్, భూపాల్ రెడ్డి, వెంకటలక్ష్మి, ఆర్డిఓ నాగలక్ష్మి మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.