75 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించిందని, నేడు స్వరాష్ట్ర మై అన్ని రంగాల్లో అద్భుత అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలో నే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని G. R. రెడ్డి IES గారు ( రిటైర్డ్ )ప్రభుత్వ సలహాదారు, ఆర్ధిక శాఖ అన్నారు

వరంగల్
ప్రచురునార్
వరంగల్
ప్రచురునార్ధం

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించిందని, నేడు స్వరాష్ట్ర మై అన్ని రంగాల్లో అద్భుత అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలో నే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని G. R. రెడ్డి IES గారు ( రిటైర్డ్ )ప్రభుత్వ సలహాదారు, ఆర్ధిక శాఖ అన్నారు.
శనివారం రోజున తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సెప్టెంబర్౼ 17 సందర్భంగా వరంగల్
CKM కాలేజ్ ప్రాంగణంలోతెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమనికి స్థానిక శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి, కూడా చైర్మన్ , డిప్యూటీ మేయర్ అదనపు కలెక్టర్ హరి సింగ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట, డి.సి.పి వెంకటలక్ష్మి
ఆర్డిఓ మహేందర్ జి సంబంధిత వరంగల్ జిల్లా కార్పొరేటర్లు వివిధ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి G. R. రెడ్డి IES గారు ( రిటైర్డ్ )ప్రభుత్వ సలహాదారు, ఆర్ధిక శాఖ ముఖ్య అతిధి గా హాజరై జాతీయ జెండా ను ఎగురవేసి…
పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు

వరంగల్ జిల్లా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికే లా భారత స్వాతంత్ర దినోత్సవ లను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించిన ఘనంగా జరుపుకున్నామని చెప్పారు దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్ణయించుకున్నామని అన్నారు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటితో 74 సంవత్సరాలు పూర్తయ్యాయని 75 వ సంవత్సరంలో ప్రవేశిస్తుందని భారతదేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజు జాతీయ సమైక్యతా దినం గా మనం ఘనంగా జరుపుకుంటున్న మని అన్నారు
తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్తు సమాజం ఉద్యమించిందని చెప్పారు ఉజ్వల ఘట్టాలు ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు
జాతీయ సమైక్యత అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదని ప్రజల మధ్య సమైక్యత విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత దేశం అనుసరిస్తున్న జీవన మాత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకునే నిజమైన దేశభక్తి అని అన్నారు
విద్యాశాఖ ద్వారా మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలోని 645 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి జరుగుతుందని చెప్పారు
వైద్య ఆరోగ్య శాఖ 2,097 ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాల్లో , 1451 ప్రైవేటు దవాఖానాల్లో మొత్తం 3548 ప్రసవాలు జరిగాయని ఇందులో 1605 మందికి కెసిఆర్ కిట్ల పంపిణీ చేశామని చెప్పారు ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి జిల్లాలో 11 వందల కోట్లతో 24 అంతస్తుల 2 వేల పడకలతో కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో ఉందని చెప్పారు
వ్యవసాయ విభాగం ద్వారా రైతులు సంఘటితంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి నూతన వ్యవసాయ పద్ధతులు పంట మార్పిడి వాటిపై అవగాహన చేసి చర్చించుకోవడానికి వీలుగా జిల్లాలో 12 కోట్ల 99 లక్షల తో59 రైతు వేదికలు నిర్మించామని అన్నారు రైతు బంధు ద్వారా ఎకరానికి ఏడాదికి పది వేలు పంటలు పెట్టుబడి ప్రభుత్వం ఇస్తుందని రైతు బంధు ద్వారా జిల్లాలో ఏడాది వానాకాలంకి గాను1,45,128 మంది రైతులకు133 కోట్ల81 లక్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని అన్నారు
ఉద్యానవన శాఖ ద్వారా2022-23 ఏడాదిలో 9233 ఎకరాల్లో పామాయిల్ తోటలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటి వరకు 12 వేల ఆరు ఎకరాల గాను3086 మంది లబ్ధిదారుల ఎంపిక జరిగిందని అన్నారు
రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ పక్కా పారదర్శకతతో ధరణి పోర్టల్ ను ప్రారంభించడం జరిగిందని వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు28 వేల
812 రిజిస్ట్రేషన్లు మరియు 11 వేల988 ఇతర సమస్యలను ధరణి ద్వారా పరిష్కరించడం జరిగిందని చెప్పారు
మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో 173 కోట్ల 69 లక్షల 37 వేల ఖర్చు తో 11 మండలాల్లో708 ఆవాసాలకు ఇంటింటికి నల్లాల ద్వారా శుద్ధి చేసిన గోదావరి మంచి నీటిని అందిస్తున్నామని అన్నారు
విద్యుత్ విభాగం ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 24 గంటలు కోతలు లేని నాణ్యమైన కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు
ఏడో విడత లో వరంగల్ జిల్లా లో హరితహారం లో భాగంగా జిల్లాలో 24 లక్షల 59 వేల మొక్కలు నాటడం జరిగింది అని ఇప్పటివరకు 7.7 శాతం పచ్చదనం పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిందని చెప్పారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా2022=23 ఏడాదిలో ఇప్పటివరకు 90 వేల
992 మంది కూలీలకు21.76 లక్షల పని దినాలు కల్పించాము
అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో కూడా క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తుందని వరంగల్ జిల్లాలో 323 గ్రామీణ క్రీడా ప్రాంగణాల గాను 133 క్రీడా ప్రాంగణాలు పరిపాలన అనుమతులు ఇవ్వగా వాటిల్లో 75 పూర్తి కాబడిన వని తెలిపారు
అర్ధం లా రోడ్లు పక్కాగా ప్రభుత్వ భవనాలు అనే ప్రభుత్వ లక్ష్యంతో పి ఎఫ్ ఎస్ టి పథకం కింద 21 పనులకు గాను 116.20 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం నిర్వహణ కోసం 31 కోట్లు మంజూరు కాగా ఇప్పటివరకు96.21 కిలోమీటర్ల మేర 18 పనులు పూర్తయ్యాయని చెప్పారు
కాట్రియాల నుండి కొత్తపల్లి వరకు 15 కోట్ల రూపాయలతో జగత్ తాండ నుండి లేబర్తి వరకు 18 కోట్ల రూపాయలతో చేపట్టిన వంతెన పనులు పురోగతిలో ఉన్నాయి అని అన్నారు

మత్స్య శాఖ విభాగం ద్వారా ఉచిత చేప రొయ్య పిల్లల సరఫరా కింద10597 టన్నుల చేపలు మరియు 442 టన్నుల రొయ్యలు ఉత్పత్తి సాధించామని దీని ద్వారా జిల్లాలో గల 10 962 మంది మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు ఒక్కొక్కరికి సగటున రూపాయలు 40 వేల రూపాయల వార్షిక ఆదాయం సమకూరిందని అన్నారు
పశుసంవర్ధక శాఖ విభాగం ద్వారా కులవృత్తులను కాపాడుకునే క్రమంలో గొల్ల, కురుమ, యాదవ కుటుంబాల వారికి 75 శాతం సబ్సిడీపై వరంగల్ జిల్లా పరిధిలోని ఇప్పటివరకు10 వేల207 మంది లబ్ధిదారులకు 95 కోట్ల 69 లక్షల రూపాయలు సబ్సిడీపై గొర్రె యూనిట్లు ఇవ్వడమైనది అని అన్నారు
పౌరసరఫరాల విభాగం ద్వారా 02 లక్షల 66 వేల668 నిరుపేద కుటుంబాలకు రూపాయి కిలో బియ్యం సరఫరా చేస్తున్నామని31 సంక్షేమ హాస్టళ్లకు388 క్వింటాళ్ల670 ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం కింద5.31 మెట్రిక్ టన్నుల మొత్తము 919 కన్నుల నాణ్యమైన బియ్యాన్ని ప్రతినెలా అందిస్తున్నాం అని అన్నారు

ధాన్యం సేకరణలో భాగంగా2021=22 యాసంగి గాను జిల్లాలో ఇప్పటివరకు 24 వేల 341 మంది రైతుల నుండి 98 వేల 818 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మొత్తము
193 కోట్లు చెల్లించడం జరిగిందని తెలిపారు

ఆసరా పెన్షన్ లు ఏ ఆసరా లేని లేని నిరుపేదలకు ప్రభుత్వమే ఆసరా అందిస్తుందని గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం ద్వారా జిల్లాలో ప్రతి నెల1 లక్షా
1 వెయ్యి 746 మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు అదనంగా ఈ సంవత్సరం29245 పింఛన్లు కొత్తగా మంజూరు చేయడం జరిగిందని అన్నారు

మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా2022=23 ఏడాదిలో బ్యాంకు లింకేజీ ద్వారా
2 వేల943 డ్వాక్రా సంఘాలకు187 కోట్ల 85 లక్షల రూపాయలు అందజేశాం .శ్రీనిధి బ్యాంక్ ద్వారా 30 కోట్ల 04 లక్షల రూపాయల రుణాలను1 వెయ్యి827 సంఘాల్లోని3640 సభ్యులకు అందించడం జరిగిందని చెప్పారు
కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద నిరుపేద తల్లి తండ్రులు తమ బిడ్డలను పెళ్లిళ్లు చేసి అప్పులపాలు కాకూడదని ఆలోచనలతో మన సీఎం కేసీఆర్ గారు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టాలని కళ్యాణ్ లక్ష్మి ద్వారా ఇప్పటి వరకు
జిల్లాలో25 వేల485 కుటుంబాలు లబ్ది పొందగా షాదీ ముబారక్ ద్వారా2 వేల 951 కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు
దళిత బంధు పథకం ద్వారా శతాబ్దాలుగా సామాజిక వివక్ష అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్దరణకు కోసం దేశ చరిత్రలో ఏనాడు ఎవరూ చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని చెప్పారు దళితులు తమ కిష్టమైన వ్యాపారం ఎంచుకునే అవకాశం ఇచ్చాం అప్పుగా కాకుండా మిత్తి లేకుండా పూర్తి ఉచితంగా 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి ఇస్తుందని అన్నారు 10 వేల రూపాయలు రక్షణ నిధి ఏర్పాటు చేసిందని ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 302 దళిత కుటుంబాలు లబ్ధి పొందాయని అని అన్నారు వరంగల్ జిల్లా ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అత్యంత చేరువ చేస్తున్నామని అన్నారు
అనంతరం జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ముఖ్య అతిథులు తిలకించి వారిని ప్రశంసించారు

Share This Post