75 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ రాజేష్ చంద్ర.

ఆగష్టు 14, 2021ఆదిలాబాదు:-

75 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ పనులపై శనివారం రోజున కలెక్టర్ ఎస్పీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆదివారం రోజున వేడుకల నిర్వహణాలపై ఎస్పీ కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అధికారులు సమన్వయంతో క్రమపద్దతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరు కానున్నారని తెలిపారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. తొలుత ముఖ్య అతిథి జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతం, గౌరవ వందనం అనంతరం జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్య అతిథి సందేశం ఉంటుందని అనంతరం పోలీస్ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభ కనబరిచిన  ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేయడం జరుగుతుందని అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన బాలబాలికలకు బహుమతుల ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, స్టాల్ ల పరిశీలన ఉంటుందని తెలిపారు. సుమారు 200 మంది బాలబాలికలచే ఆరు సాంస్కృతిక కార్యక్రమాలు, తొమ్మిది ప్రభుత్వ శాఖల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై 13 శాఖల స్టాల్ ల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, అదనపు ఎస్పీ వినోద్ కుమార్, రాజస్వ మండల అధికారి జాడి రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post