75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా జాతిపిత మహాత్మా గాంధీ మీద రూపొందించిన గాంధీ అనే సినిమా ప్రదర్శన కు జిల్లా లోని అన్నీ థియేటర్ ల యాజమాన్యం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు

ప్రచరునార్ధం

75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా జాతిపిత మహాత్మా

గాంధీ మీద రూపొందించిన గాంధీ అనే సినిమా ప్రదర్శన కు జిల్లా లోని అన్నీ థియేటర్ ల యాజమాన్యం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు

శనివారం రోజున కలెక్టర్ చాంబర్లో వరంగల్ జిల్లా థియేటర్ల యాజమాన్యంతో సమావేశం నిర్వహించి కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలు లో భాగంగా జిల్లాలో విద్యార్థులకు ఉచితంగా మహాత్మా గాంధీ మీద రూపొందించిన “‘ గాంధీ “” సినిమా ప్రదర్శన ఉంటుందని జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు

ఇందుకు థియేటర్ల యాజమాన్యం సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు

జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కలిపి 54 వేల మంది ఉన్నారని… జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటుపాఠశాలల విద్యార్థినీ విద్యార్థులను జిల్లాలో ఉన్న అన్ని థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శనను తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

థియేటర్ల యాజమాన్యంతో సీటింగ్ కెపాసిటీ, సినిమా ప్రదర్శన టైమింగ్స్ తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు

డిస్టిక్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ ఆర్ సి ఓ జిల్లా విద్యాశాఖ అధికారి సమన్వయంతో వ్యవహరించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు

ఈ నెల 9tనుండి 11 వరకు… మళ్ళీ 16 వ తేదీ నుండి 21 వ తేదీల వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:15 వరకు సినిమా ప్రదర్శనలు ఉంటాయని అన్నారు

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీవత్సవ కోట కలెక్టరేట్ ఏవో విశ్వ నారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, ఆర్ సి ఓ వీర థియేటర్ల యాజమాన్యం సభ్యులు పాల్గొన్నారు

Share This Post