75 సంవత్సరాల అమృత మహోత్సవాలలో భాగంగా ప్రతి పౌరుడు కోవిడ్ వాక్సినేషన్ చేయించుకోవాలి.. అదనపు కలెక్టర్ మోతిలాల్

75 సంవత్సరాల అమృత మహోత్సవాలలో భాగంగా ప్రతి పౌరుడు కోవిడ్ వాక్సినేషన్ చేయించుకోవాలి.. అదనపు కలెక్టర్ మోతిలాల్

75 సంవత్సరాల భారత దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల త్యాగాల ఫలితమే ఇప్పుడు ప్రభుత్వం నుండి మనం పొందుతున్న ఫలాలు అని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ రేషన్ డీలర్లకు సూచించారు.

బుధవారం 75 సంవత్సరాల అమృత్ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డి.సి.ఎస్ గోడౌన్ లో రేషన్ డీలర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన అమరవీరుల కృషి వలనే నేడు మనం అనుభవిస్తున్న ఫలాలు పొందుతున్నాం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి అన్నారు. అలాగే మనం ఎప్పుడూ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించే మాట్లాడుతూ ఉంటాము కానీ హక్కులను మర్చిపోతున్నాం. కాబట్టి మీ మొదటి బాధ్యతగా ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి అన్నారు. అలాగే కుటుంబ సభ్యులను, పక్కవారు కూడా తీసుకునేలా ప్రోత్సహించాలి అన్నారు. వాక్సినేషన్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యమే కాకుండా, పక్కవారి కూడా కరోనా సోకకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాక్సినేషన్ తీసుకోవాలని కోరారు. దీనివల్ల జిల్లాలో కోవిడ్ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఇప్పటి వరకు మన జిల్లాలో 85 శాతం మంది మొదటి డోస్ వాక్సినేషన్ వేసుకున్నారు. మిగతా 15 శాతం మంది కూడా వాక్సినేషన్ తీసుకునేలా రేషన్ డీలర్లు అందరూ కూడా సహకరించాలి అన్నారు. అందుకు గాను రేషన్ బియ్యం కోసం వచ్చిన వారిలో వ్యాక్సినేషన్ తీసుకొని వారిని గుర్తించి, వారి వివరాలు సేకరించి వ్యాక్సినేషన్ తీసుకునేలా అవగాహన కల్పించాలి అన్నారు.

అలాగే యాసంగిలో వరి పంటకు బదులు ఆరుతడి పంటలైన వామ, నువ్వులు, కుసుమలు, పల్లి, శనగలు, తదితర పంటలు వేయాలని సూచించారు. పంట మార్పిడికి పోతే మంచి లాభాలు కూడా వస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. 75 సంవత్సరాల అమృత్ ఉత్సవ్ లో భాగంగా వన్ నేషన్ వన్ కార్డు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. ఈనెల 16వ తారీకున పరిగిలో, 24వ తారీకున తాండూర్ లో, 30వ తారీకున కొడంగల్ లో అమృత్ ఉత్సవాలు జరుపుకుంటాం కాబట్టి అట్టి కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డి.సి.ఎస్.ఓ రాజేశ్వర్, డిఎమ్ సివిల్ సప్లై అధికారిని విమల, జిల్లా డీలర్ల సంఘం ప్రెసిడెంట్ జూకారెడ్డి, డీలర్లు, రేషన్ కార్డు హోల్డర్లు, గోడౌన్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post