75 సం.ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు (అమృత మహోత్సవాలు) సందర్భంగా 2K రన్ : జిల్లా అధనపు కలెక్టర్ (లోకల్ బాడీ) అంకిత్

పత్రిక ప్రకటన. 11.9.2021.వనపర్తి.

మన శరీరం, మనస్సు స్వాధీనంలో ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజూ రన్నింగ్, యోగా, మెడిటేషన్ చేయాలని జిల్లా అధనపు కలెక్టర్ లోకల్ బాడీ అంకిత్ అన్నారు.

స్వతంత్ర భారత అమృత మహోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా నె హ్రూ యువ కేంద్రం ఉమ్మడి మహాబునగర్.వారి ఆధ్వర్యంలో శనివారం నాడు ఉదయం వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్. కాలేజ్ నుండిఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పాలిటెక్నిక్ కాలేజ్ నుండి ఎకోపర్క్ వరకు 2.0 రన్ లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత మన జీవన విధానంలో బిజీగా ఉంటున్నామని, మన శరీరము, మనస్సు స్వాధీనంలో ఉండాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ యోగ, మెడిటేషన్, రన్నింగ్ చేయాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొనాలని అన్నారు.

2.0 రన్ లో NYK జిల్లా యుత్. ఆఫీసరు ఉమ్మడి మహబూబ్నగర్ కోటనాయక్ వెంకబోతు మున్సిపల్ చైర్మన్.గట్టు యాదవ్. యుం. అర్ వో రాజేందర్ గౌడ్ మున్సిపల్. కమిషనర్. మహేశ్వర రెడ్డి ci ప్రవీణ్ కుమార్ si మధు సుధన్ జిల్లా పౌర సంబంధాల అధికారి రషీద్, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు, ఎన్ సి సి క్యాడెట్స్ పాల్గొన్నారు.

………………………..

జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడం ఆయినది.

 

Share This Post