8వ విడత హరితహారం కార్యక్రమం పకడ్బందిగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే పకడ్బందిగా ప్రణాలికలు సిద్దం చేసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం మహబుబ్ నగర్ లోని కలెక్టర్ చాంబర్ నుండి నారాయనపేట జిల్లా అధికారులతో వెబ్ నార్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లాలో 8వ విడత హరితహారం నిర్వహణ, మన ఉరు మనబడి, దళితబంధు, వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష నిర్వహించారు. హరితహారం సమీక్షా సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ సారి హరితహారం లో 30 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాలికలు చేసుకోగా అదనముగా మరో 15 వేలు కలుపుకొని 45 వేల మొక్కలు నాటేందుకు ఆయా జిల్లా అధికారులకు విడివిడి గా లక్ష్యాలను నిర్దేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలన్నారు. మండలాల వారిగా ప్రణాలికలు చేసుకొని ఈనెల 7వ తేదిన సమర్పించాలని తదుపరి మండలాల వారిగా సమీక్షా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సారి ఇరిగేషన్ కెనాల్, కలువల పొంటి మొక్కలు అధికంగా నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు జారి చేసినందున ఇరిగేషన్ ఇంజనీర్ల ద్వారా మొత్తం ఎన్ని కిలోమీటర్ల కాలువలు, కెనాల్ ఉంది ఎన్ని ఎ రకమైన మొక్కలు అవసరం అవుతాయి పక్కగా ప్రణాలికలు చేసుకోవాలన్నారు. మున్సిపాలిటిలు, గ్రామా పంచాయతీలు తమ నిధుల నుండి 10 శాతం గ్రీన్ బడ్జెట్ గా హరిత హారానికి ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. 2020-21, 21-22 ఆర్ధిక సంవత్సరం లో జిల్లాలోని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతి లు ఎవరెవరు ఎంతమేరకు గ్రీన్ గాడ్జెట్ కు ఖర్చు చేసారో పూర్తి వివరాలు సిద్ధం చేసి ఇవ్వాలని జిల్లా కోశాధికారిని ఆదేశించారు. రహదారి పొడవున మూడు వరుసలలో మొక్కలు వివిధ ఎత్తులలో కనిపించేవిధంగా నాటేందుకు ప్రణాలికలు చేసుకోవాలని, గత సంవత్సరం నాటిన ప్రతి మొక్కను బతికించుకునే విధంగా నీళ్ళు పోసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
మన ఊరు మనబడి కార్యక్రమం పై సమీక్షిస్తూ మొదటి విడతలో గుర్తించిన పాటశాల మరమ్మతులు ఆధునీకరణ పనులు ఇంజనీరింగ్ శాఖ ద్వారా కలెక్టర్ లాగిన్ లో కనిపించే విధగా అప్లోడ్ చేయాలని, పరిపాలన అనుమతి మంజూరు పొందిన వాటిలో వెంటనే పనులు ప్రారంభిన్చాలని ఆదేశించారు. డి.ఆర్.డి.ఎ ఉపాధిహామీ ద్వారా పనులు చేపట్టడం, సకాలంలో మస్టర్ అప్లోడ్ జరిగేవిధంగా చూడాలన్నారు.
దళితబందు పై మాట్లాడుతూ నియోజక వర్గాల వారిగా ఎంపికైన లబ్దిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వరి కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభించి ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందుకు లేకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు క్రమం తప్పకుండ సందర్శించి సమీక్షిస్తూ ఉండాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ పద్మజ రాణి హరితహారానికి కావలసిన మొక్కలు అటవీ శాఖ ద్వారా ఎన్ని ఉన్నాయి, గ్రమినాభివ్రుద్ధి శాఖ ద్వారా అభివృద్ధి చేసిన నర్సరిల్లో ఎన్ని మొక్కలు ఎ స్థాయిలో ఉన్నాయి అనే పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొక్కలు నర్సరిల్లో ఇప్పటి వరకు ఇంకా ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకుంటే అటవీ శాఖ సిబ్బంది సలహాలతో జీవామృతం క్రమం తప్పకుండ వేస్తూ మొక్కలు త్వరగా ఎదిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ మున్సిపాలిటిల్లో సరిపడా మొక్కలు అందుబాటులో లేని పక్షంలో కొనుక్కోడానికి టెండర్లు వేసి సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ సంవత్సరం అటవీ శాఖ వద్ద 1.95 లక్షల మొక్కలు సిద్ధంగా ఉండగా డి.ఆర్.డి.ఎ ద్వారా నర్సరిల్లో దాదాపు 70 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే నర్సారిల్లో ఇంకా సరైన ఎత్తుకు మొక్కలు ఎదుగలేదని త్వరగా ఎదిగేందుకు ఎరువులు, జీవామృతం వంటివి వాడాలని మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పి.డి. డి.ఆర్.డి.ఎ. గోపాల్ నాయక్, డి.ఎఫ్.ఓ వీణావాణి, సివిల్ సప్లై అధికారి శివప్రసాద్ రెడ్డి, ఆర్.డి.ఓ రాంచందర్ నాయక్, జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, ఎం.పి.ఓ లు, డి.టి.లు తదితరులు పాల్గొన్నారు.