8వ విడత హరితహారం కార్యాచరణను రూపొందించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-1

తేదీ.30.4.2022

ప్రచురణార్థం----1 తేదీ.30.4.2022 8వ విడత హరితహారం కార్యాచరణను రూపొందించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి జగిత్యాల, ఏప్రిల్ 30:- జిల్లాలో 8వ విడత హరితహారం కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. హరితహారం, పారిశుధ్యం, దళిత బంధు, వంటి అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2022-23 సంవత్సరం జిల్లాలో 40.88 లక్షల మొక్కలు నాటాలని, మున్సిపాలిటీలలో, గ్రామాలలో మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హరితహారం కింద నాటే మొక్కలు మన నర్సరీల లోనే తయారు చేసుకోవాలని, నర్సరీలో మొక్కల పెంపకం పై అటవీ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం,మార్గదర్శకాలు అందజేయాలని కలెక్టర్ సూచించారు.  హరితహారం కార్యక్రమం నిర్వహణ పై ప్రతి మండలం తమ పరిధిలో నర్సరీలు వారీగా ప్రణాళికతో, మ్యాచింగ్, బ్యాచింగ్ ప్రకారం మొక్కలు రూపొందించుకోవాలని ఆదేశించారు.నర్సరీలో జరుగుతున్న ప్లాంటేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.   మెగా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం జిల్లాలోని 18 మండలంలో 10 ఎకరాల చొప్పున భూమి గుర్తించామని, బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం ఏర్పాటు కోసం దాదాపు 71 ఎకరాలు గుర్తించామని, వీటిలో మొక్కల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పల్లె ప్రకృతి వనాల్లో ప్రతి ఎకరాకు స్థలానికి 4వేల మొక్కలు నాటాలని, తక్కువ ప్రాంతంలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు.  జిల్లాలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు ఏర్పాటు చేసిన ట్రీ గార్డులను అవసరం లేనిచోట తీసివేయాలని, ప్రస్తుత సంవత్సరం మొక్కలు నాటి సమయంలో వారిని వినియోగించాలని కలెక్టర్ సూచించారు.  జిల్లాలోని గ్రామాలు, పట్టణాల వారీగా నాటిన మొక్కల సంఖ్య వివరాలు నిర్ణయించిన తర్వాత గ్రామాల వారీగా హరితహారం కింద చేపట్టవలసిన పనుల ప్రతిపాదనలు 7 రోజులలో తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో నీటిపారుదల శాఖ కింద కేనాళ్ళ వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ కాలువలు, చెరువుల హద్దుల, నది బ్యాంకులు వద్ద మొక్కలు నాటే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రతి గ్రామంలో కనీస 50 మందికి ఉపాధి హామీ పనులు కల్పించే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న మొక్కలకు ప్రతివారం 3 సార్లు వాటరింగ్ చేసే విధంగా తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం పై అధిక శ్రద్ధ వహించాలని, జిల్లాలో మురుగు కాలువల్లో చెత్త పూర్తి స్థాయిలో తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు , ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల పరిశుభ్రత బాధ్యత స్థానిక సంస్థలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సెప్టిక్ ట్యాంక్ సంబంధిత ప్రచార రాతలను గోడలపై నుంచి తొలగించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో సీసీ చార్జీలు, ట్రాక్టర్ లోన్ రీపేమెంట్ ప్రతినెల చెల్లించాలని కలెక్టర్ సూచించారు.  దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 344 లబ్ధిదారులను ఎంపిక చేసామని, దాదాపు అందరికీ యూనిట్లు మంజూరు చేసి వారి ఖాతాల్లో నిధులు జమ చేసామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో దాదాపు 137 దళిత బంధు లబ్ధిదారులకు ప్రారంభంగా 30వేలు విడుదల చేసుకునేందుకు అనుమతి అందించామని కలెక్టర్ పేర్కొన్నారు. రవాణా సెక్టార్ కింద, వ్యవసాయ సెక్టార్ కింద వాహనాలు ఎంపిక చేసుకునే అభ్యర్థుల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ సేకరించాలని వాహనాల కొనుగోలుకు ఆర్డర్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 25 మంది లబ్ధిదారుల డాక్యుమెంటేషన్ పూర్తి కానందున వారికి నిధులు విడుదల కు అనుమతి అందలేదని, అధికారులు ఫాలోఅప్ చేసి సంబంధిత డాక్యుమెంట్లు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దళిత బాద్ లబ్ధిదారులు నిధులు వినియోగించుకున్న తర్వాత తదుపరి నిధులు విడుదలకు అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. దళిత బంధువుడు యూనిట్ల గ్రౌండింగ్ అయ్యే ప్రకారం నిధుల విడుదలకు అనుమతి కల్పిస్తామని, ప్రభుత్వం నుంచి నిధులు ఎలాంటి ఆటంకం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఇంచార్జి అదనపు కలెక్టర్,ఆర్.డి.ఓ. జగిత్యాల, డి.ఆర్.డి.ఓ., డి.ఎఫ్.ఓ. , మున్సిపల్ కమిషనర్లు, ఎం.పి.డి.ఓ.లు, తహసీల్దార్లు, ఎం.పి.ఓ.లు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది
8వ విడత హరితహారం కార్యాచరణను రూపొందించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల, ఏప్రిల్ 30:- జిల్లాలో 8వ విడత హరితహారం కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. హరితహారం, పారిశుధ్యం, దళిత బంధు, వంటి అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

2022-23 సంవత్సరం జిల్లాలో 40.88 లక్షల మొక్కలు నాటాలని, మున్సిపాలిటీలలో, గ్రామాలలో మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హరితహారం కింద నాటే మొక్కలు మన నర్సరీల లోనే తయారు చేసుకోవాలని, నర్సరీలో మొక్కల పెంపకం పై అటవీ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం,మార్గదర్శకాలు అందజేయాలని కలెక్టర్ సూచించారు.

హరితహారం కార్యక్రమం నిర్వహణ పై ప్రతి మండలం తమ పరిధిలో నర్సరీలు వారీగా ప్రణాళికతో, మ్యాచింగ్, బ్యాచింగ్ ప్రకారం మొక్కలు రూపొందించుకోవాలని ఆదేశించారు.నర్సరీలో జరుగుతున్న ప్లాంటేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

మెగా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం జిల్లాలోని 18 మండలంలో 10 ఎకరాల చొప్పున భూమి గుర్తించామని, బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం ఏర్పాటు కోసం దాదాపు 71 ఎకరాలు గుర్తించామని, వీటిలో మొక్కల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.

పల్లె ప్రకృతి వనాల్లో ప్రతి ఎకరాకు స్థలానికి 4వేల మొక్కలు నాటాలని, తక్కువ ప్రాంతంలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు ఏర్పాటు చేసిన ట్రీ గార్డులను అవసరం లేనిచోట తీసివేయాలని, ప్రస్తుత సంవత్సరం మొక్కలు నాటి సమయంలో వారిని వినియోగించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల వారీగా నాటిన మొక్కల సంఖ్య వివరాలు నిర్ణయించిన తర్వాత గ్రామాల వారీగా హరితహారం కింద చేపట్టవలసిన పనుల ప్రతిపాదనలు 7 రోజులలో తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో నీటిపారుదల శాఖ కింద కేనాళ్ళ వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ కాలువలు, చెరువుల హద్దుల, నది బ్యాంకులు వద్ద మొక్కలు నాటే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రతి గ్రామంలో కనీస 50 మందికి ఉపాధి హామీ పనులు కల్పించే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న మొక్కలకు ప్రతివారం 3 సార్లు వాటరింగ్ చేసే విధంగా తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం పై అధిక శ్రద్ధ వహించాలని, జిల్లాలో మురుగు కాలువల్లో చెత్త పూర్తి స్థాయిలో తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు , ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల పరిశుభ్రత బాధ్యత స్థానిక సంస్థలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సెప్టిక్ ట్యాంక్ సంబంధిత ప్రచార రాతలను గోడలపై నుంచి తొలగించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో సీసీ చార్జీలు, ట్రాక్టర్ లోన్ రీపేమెంట్ ప్రతినెల చెల్లించాలని కలెక్టర్ సూచించారు.

దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 344 లబ్ధిదారులను ఎంపిక చేసామని, దాదాపు అందరికీ యూనిట్లు మంజూరు చేసి వారి ఖాతాల్లో నిధులు జమ చేసామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో దాదాపు 137 దళిత బంధు లబ్ధిదారులకు ప్రారంభంగా 30వేలు విడుదల చేసుకునేందుకు అనుమతి అందించామని కలెక్టర్ పేర్కొన్నారు. రవాణా సెక్టార్ కింద, వ్యవసాయ సెక్టార్ కింద వాహనాలు ఎంపిక చేసుకునే అభ్యర్థుల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ సేకరించాలని వాహనాల కొనుగోలుకు ఆర్డర్ చేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో 25 మంది లబ్ధిదారుల డాక్యుమెంటేషన్ పూర్తి కానందున వారికి నిధులు విడుదల కు అనుమతి అందలేదని, అధికారులు ఫాలోఅప్ చేసి సంబంధిత డాక్యుమెంట్లు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దళిత బాద్ లబ్ధిదారులు నిధులు వినియోగించుకున్న తర్వాత తదుపరి నిధులు విడుదలకు అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.

దళిత బంధువుడు యూనిట్ల గ్రౌండింగ్ అయ్యే ప్రకారం నిధుల విడుదలకు అనుమతి కల్పిస్తామని, ప్రభుత్వం నుంచి నిధులు ఎలాంటి ఆటంకం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ విడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఇంచార్జి అదనపు కలెక్టర్,ఆర్.డి.ఓ. జగిత్యాల, డి.ఆర్.డి.ఓ., డి.ఎఫ్.ఓ. , మున్సిపల్ కమిషనర్లు, ఎం.పి.డి.ఓ.లు, తహసీల్దార్లు, ఎం.పి.ఓ.లు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

Share This Post