8వ విడత హరితహారం కార్యాచరణ రూపొందించాలి … ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.

8వ విడత హరితహారం కార్యాచరణ రూపొందించాలి … ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.

ప్రచురణార్థం

8వ విడత హరితహారం కార్యాచరణ రూపొందించాలి … ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.

మహబూబాబాద్, ఏప్రిల్ -29:

ప్రణాళికాబద్ధంగా 8వ విడత హరితహారం నిర్వహించుటకు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు.

శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి తెలంగాణకు హరిత హారం, ధాన్యం కొనుగోలు, దళిత బంధు, వ్యవసాయం అంశాలపై వీడియో సమావేశం నిర్వహించి 8వ విడత హరితహారం కార్యాచరణ సిద్ధం చేయాలనీ ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, సంభందిత జిల్లా అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, డివిజన్ స్థాయి అటవీ అధికారులు హరిత హారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, నీటిపారుదల ప్రాజెక్ట్ లు, ఎక్సైజ్, మునిసిపల్, రూరల్ కు సంబంధించిన ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేయాలని, బ్లాక్, కెనాల్ ఏరియా లను గుర్తించాలని, అలాగే ఈ హరిత హారంలో ఎక్సైజ్ కు సంబంధించి 80 వేల మొక్కలు ప్లాంటేషన్ లక్ష్యం మేరకు చర్యలు తీసుకోవాలని, గౌడ సంఘాలు, మిగతా సంఘాల వారితో కో ఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు.

ప్లాంటేషన్ కొరకు గుర్తించిన స్థలాలను, శుభ్రం చేసుకొని ప్రొటెక్షన్ చేసి ప్లాంటేషన్ కు సిద్దంగా ఉంచాలని తెలిపారు. ప్లాంటేషన్ అనంతరం మొక్కలు పెరిగే విధంగా ఉండాలని, కేవలం లక్ష్యం కొరకు మొక్కలు నాటరాదని, మొక్కలు పెరిగే విధంగా అనుకూల ప్రదేశాలలో నాటాలని, జిల్లాలో హరిత హారం క్రింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా చెరువులు ఎక్కువ ఉన్న జిల్లా అని, వాటి ప్రక్కన ప్లాంటేషన్ కొరకు స్థలాలు గుర్తించాలని, ఇంజనీరింగ్ విభాగాలు ప్లాంటేషన్ కు అనువైన ప్రదేశాల వివరాలను అందించాలని, మహబూబాబాద్ లో పల్లె ప్రకృతి వనాలు 36 వార్డులకు 54 ఉన్నాయని, అందులో ఉన్న మొక్కలు ఎక్కువ గ్రోత్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

దళిత బంధు యూనిట్ లు మంజూరైన వాటిని గ్రౌండింగ్ చేయాలని, రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి రైతులకు ఎరువుల వినియోగం, ఇతర అంశాలపై అవగాహన కల్పించాలని, ప్రతి రైతు వేదికలో అవగాహన షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని, పని చేయని అధికారులను తొలగించాలని, ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, నాణ్యమైన ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఎఫ్.డి. ఓ., సర్కిల్ హెడ్స్, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, జిల్లా కో ఆపరేటివ్ అధికారి సయ్యద్ ఖుర్షీద్, డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై, మునిసిపల్ కమిషనర్ లు ప్రసన్న రాణి, జి.బాబు, పి.అర్. – ఈ.ఈ. సురేష్, ఆర్ అండ్ బి – ఈ. ఈ. తానేశ్వర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.కిరణ్ నాయక్ , జిల్లా సివిల్ సప్లయ్ అధికారి నర్సింగరావు, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post