8 వ రోజు వెన్నముద్దల బతుకమ్మ ను జిల్లా పరిషత్ మరియు నారాయణపేట మున్సిపాలిటీ అద్వర్యం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా పరిషత్ కార్యాలయం నుండి చైర్మన్ వనజమ్మ బతుకమ్మలను తీసుకొని బారం బావికి చేరుకొని ప్రత్యెక పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు

8 వ రోజు వెన్నముద్దల బతుకమ్మ ను జిల్లా పరిషత్ మరియు నారాయణపేట మున్సిపాలిటీ అద్వర్యం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా పరిషత్  కార్యాలయం నుండి   చైర్మన్ వనజమ్మ బతుకమ్మలను తీసుకొని బారం బావికి చేరుకొని  ప్రత్యెక పూజలు నిర్వహించి  బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచి, విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించింది బతుకమ్మ పండగ అన్నారు.  తెలంగాణ ఆడపడుచులు అందరూ ఎంతో సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ, అనుబంధాలను గుర్తుచేస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందన్ని  బతుకమ్మ పండుగను అద్భుతమైన పూల ఉత్సవంగా, ప్రకృతిని పూజించే పండుగగా జరుపుకుంటున్నమన్నారు. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి, అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించి అందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటు  తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉండే జానపద గీతాలతో ఈ పండుగను జరుపుకోవడం విశేషమన్నారు.

ఈ కార్యక్రంమం లో zpవైస్ చైర్మన్ సురేఖ రెడ్డి, జిల్లా అధికారులు జ్యోతి, నరేందర్, మున్సిపల్ కమిషనర్ సునీత, zptc లు అశోక్,అంజలి రాములు, ఎంపిడిఓ లు యంపీఓ లు పంచాయతీ సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post