8.9.2021. గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించేలా ఎంపీడీవో, ఎంపీవో, ఏ పీ ఓ లు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదేశించారు.

Press note. 8.9.2021.

గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించేలా ఎంపీడీవో, ఎంపీవో, ఏ పీ ఓ లు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదేశించారు.

వారితో బుధవారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ పనులకు సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణపై మండలాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులకు సంబంధించి అతి ముఖ్యమైన నాలుగు అంశాలు జాబ్ కార్డ్ అప్ డేషన్, 7 రిజిస్టర్ల నిర్వహణ, వర్క్ సైట్ బోర్డ్స్ ఏర్పాటు, ఫోటోలతో కూడిన వర్క్ ఫైల్ పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు ప్రారంభానికి ముందు, పనులు జరుగుతున్నప్పుడు, పనులు పూర్తయిన తర్వాత మూడు రకాల ఫోటోలు తప్పనిసరిగా వర్క్ ఫైల్ లో పెట్టాలని, పనులు నిర్వహించిన చోట వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. జాబ్ కార్డ్స్ సంబంధించి ఎలాంటి పెండింగ్ ఉండకూడదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ పనులకు తీర్మానాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఏడు రిజిస్టర్లు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈజీఎస్ పనులకు సంబంధించి క్యాష్ బుక్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, జరుగుతున్న పనులకు సంబంధించి మస్టర్ రిజిస్టర్లలో అందరి సంతకాలు ఉండాలని తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో మన జిల్లా ఎలా అయితే ప్రథమ స్థానంలో ఉందో, అలాగే పనుల వివరాలు తెలిపి వర్క్ ఫైల్, రిజిస్టర్లు నిర్వహణ, వర్క్ సైట్ బోర్డులు అన్ని వివరాలతో పకడ్బందీగా ఉండాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే , జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, మండల స్పెషల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.

……….DPRO. KMR

Share This Post