8.9.2021 వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్ళపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు.

Press Note. 8.9.2021

వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్ళపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు.

బుధవారం నాడు కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఈ వానా కాలం జిల్లా వ్యాప్తంగా రైతుల నుండి కొనుగోలు నిమిత్తం 4 లక్షల, 2 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అక్టోబర్ రెండో వారం నుండి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్ యంత్రాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, తేమ శాతం గురించి వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు ముందే అవగాహన కల్పించాలని, కొనుగోళ్ళు సులభతరంగా అయ్యేందుకు కావలసిన చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో ఇప్పటి నుండే పనిచేయాలని సూచించారు.
గత ఖరీఫ్ సి.ఎం.ఆర్. పెండింగ్ ఈ నెల 15లోగా పూర్తి చేయాలని రైస్ మిల్లర్ల ప్రతినిధులను ఆదేశించారు.

సమీక్షలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవ రావు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ వసంత, జిల్లా సివిల్ సప్లై డి ఎం జితేందర్ ప్రసాద్, జిల్లా సరఫరాల అధికారి రాజశేఖర్, మార్క్ఫెడ్ డీఎం, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, జనరల్ సెక్రటరీ గౌరీశంకర్ పాల్గొన్నారు.

……..DPRO. KMR

Share This Post