నకిలీ విత్తనాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పాల్గొన్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్

నకిలీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం

గడ్డి మందు గ్లైఫో సెట్ అమ్మకాలపై వ్యవసాయ అధికారులు నిఘాపెట్టాలి

లైసెన్స్  లేకుండా విత్తనాలు అమ్మినా, కాలంతీరిన విత్తనాలను అమ్మినా కఠినచర్యలు తీసుకోవాలి .. హెచ్ టీ కాటన్ విత్తనాలను అరికట్టాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

000000

.నకిలీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం
మోపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎస్పీలను, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

శనివారం వానాకాలం వ్యవసాయ ప్రణాళికలో భాగంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎఓ, ఎఓలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుండి మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ
నకిలీ విత్తనాల విధానం
అమ్మకందారుల పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాలలో నకిలీ విత్తన సమస్య  ఉన్నదని,
తక్కువ ధరకు విత్తనాలు లభిస్తుండడం మూలంగానే రైతులు నకిలీ విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు.
ప్రధానంగా సాగులో ఉండే కలుపు సమస్యను ఎదుర్కోవడానికి  గడ్డి మందు కొట్టేందుకు అవకాశం ఉండడంతో కలుపుకూళ్లు తగ్గుతున్నాయని రైతులు నకిలీ విత్తనాల వైపు ఆకర్షితులవుతున్నారు
గడ్డి మందు గ్లైఫో సెట్ అమ్మకాలపై వ్యవసాయ అధికారులు నిఘాపెట్టాలని ఆదేశించారు.
రైతులు తక్కువ ధరకు వస్తున్నాయన్న ఉద్దేశంతో నకిలీ విత్తనాలను కొనవద్దని సూచించారు.ఈ ఏడాది పత్తి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్నదని మంత్రి తెలిపారు.
గత ఏడాది వర్షాలు వెనకా ముందు కావడం, అధికవర్షాల మూలంగా పెద్దఎత్తున సాగు చేయలేకపోయారని అన్నారు.
తనిఖీలలో నిబంధనల మేరకే టాస్క్ ఫోర్స్ టీం వ్యవహరించాలని తనిఖీలలో అత్యుత్సాహం ప్రదర్శించడం, తనిఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని మంత్రి అన్నారు .
నకిలీ విత్తనాలతో పట్టుబడ్డ వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విత్తనాలు, పురుగుమందుల స్టాక్ వివరాలు దుకాణాల ముందు ఉంచాలని,స్టాక్ వివరాలు పెట్టలేదన్న కారణాలతో షాపులు సీజ్ చేయొద్దని వారికి విషయం తెలిపి అవకాశం ఇవ్వాలని సూచించారు.లైసెన్స్  పరిమితి తీరిన తర్వాత దానిని రెన్యువల్ కు కొంత సమయం ఉంటుందని,ఆ సమయం కూడా తీరి ఉంటేనే అమ్మకందారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
నకిలీ విత్తనాలు అని నిర్దారణ అయిన తర్వాతనే కేసులు నమోదు చేయాలని తెలిపారు.
విత్తనరంగంలో తెలంగాణకు ఉన్న ఖ్యాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని అన్నారు.నకిలీ విత్తనాల కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
చట్టంలోని లొసుగులతో దోషులు తప్పించుకోకుండా వెంటనే  శిక్షలు అమలయితే నకిలీ విత్తన తయారీదారులలో మార్పు వస్తుందని అన్నారు. దోషులు తప్పించుకోవద్దు,నిర్దోషులు ఇబ్బందులు ఎదుర్కోకూడదు రైతుల కష్టం వృధాకావద్దు అన్నారు.

ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ కరీంనగర్ జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను మంత్రికి వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో హైదరాబాద్ నుండి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి  రఘునందన్ రావు,  సీపీలు  మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, ఐజీ నాగిరెడ్డి, ఐజీ డీఎస్ చౌహాన్, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్  అనిల్ కుమార్, ఐజీపీ ఇంటలిజెన్స్  రాజేష్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు కరీంనగర్ నుండి ఎస్బి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డివిజన్ మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post