ప్రచురణార్థం

పనులను నాణ్యతతో చేపట్టాలి…

జనగామ మే 10.

మన ఊరు మన బడి కార్యక్రమం కింద పాఠశాల అభివృద్ధికై చేపడుతున్న పనులు నాణ్యతతో చేపట్టాలని ఎస్సీఈఆర్టీ సంచాలకులు రాధా రెడ్డి ఆదేశించారు.

మంగళవారం జనగామ మండలం లోని పసర మడ్ల, సిద్ధేంకి గ్రామాల్లో పర్యటించి మండల ప్రాధమిక పాఠశాలల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద చేపడుతున్న కిచెన్ షెడ్ నిర్మాణ పనులను ఆమె జిల్లా విద్యాశాఖ అధికారి రాము, ఆ యా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి స్వయంగా సందర్శించి పరిశీలించారు.

ముందుగా పసరమడ్ల గ్రామంలోని పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల సంఖ్య 40గా ఉండేదని ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులు తో చర్చించడంతో ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం పెరిగి 151 సంఖ్యకు చేరుకుందని, దాతల సహకారం ఉందని, పాఠశాల అభివృద్ధి పనులు వివరిస్తున్నాం అని తద్వారా విద్యార్థుల సంఖ్య కూడా 170 వరకు పెరిగే అవకాశం ఉందని, పసర మడ్ల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి సంచాలకులకు వివరించారు.

ఈ సందర్భంగా పాఠశాలల అభివృద్ధి పై సంచాలకులు మాట్లాడుతూ… ఉపాధిహామి పధకం క్రింద చేపడుతున్న పనులకు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరుగుతాయన్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో చేపడుతున్న పనులలో నాణ్యతపరంగా ఉండే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. పనులను ప్రారంభించే ముందుగా ఫోటో తీసి పెట్టుకోవాలని అదే విధంగా పని పూర్తయిన తర్వాత కూడా ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నారు.

పాఠశాలలో మిషన్ భగీరథ కనెక్షన్, త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు వంటి పలు అభివృద్ధి పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు . విద్యార్థులకు తగినట్లుగా సదుపాయాలు ఉన్నాయని సిద్ధంకి ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ సుంకరి నిర్మల శ్రీనివాసరెడ్డి తెలియజేయడంతో ఆమె సంతృప్తి చెందారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము మండల విద్యాధికారి భగవాన్ pasaramadla సిద్దెంకి ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, పరశయ్య, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం జనగామ వారిచే జారీ చేయడమైనది

Share This Post