ప్రచురణార్థం

సాధారణ కాన్పుల వల్లనే తల్లి పిల్లల ఆరోగ్యం శ్రేయస్కరం…

జనగామ మే 10.

సాధారణ కాన్పుల వల్లనే తల్లి పిల్లల ఆరోగ్యం పరిస్థితులు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సాధారణ కాన్పుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సి సెక్షన్ తగ్గించాలని సాధారణ కాన్పు ల సంఖ్య 40 శాతం తక్కువ కాకుండా పెంచాలన్నారు.

రాష్ట్రంలో సాధారణ కాన్పుల సంఖ్య 53% గా నమోదైతే సి సెక్షన్ 47 శాతంగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో 60 శాతం గా సాధారణ కాన్పు లసంఖ్య ఉందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో 18 శాతంగా ఉందని సి సెక్షన్ సంఖ్య తగ్గిస్తూ సాధారణ కాన్పుల సంఖ్య 40 శాతానికి పెంచాలన్నారు.

పల్లె దవాఖాన స్థాయిలో గర్భిణీ స్త్రీలకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అమ్మఒడి వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్ఎంపీలు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు సాధారణ కాన్పు సంఖ్య పెంచేందుకు డాక్టర్లు ప్రోత్సహించాలని అన్నారు.

సి సెక్షన్( సిజేరియన్) ఆపరేషన్ లు వలన కలిగే నష్టాలను, సాధారణ ప్రసవాలు వలన కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు వైద్య సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు.

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లోనే సాధారణ కాన్పుల సంఖ్య పెరుగుతున్నదని ప్రైవేట్ డాక్టర్లు గ్రహించాలన్నారు.

కాన్పుల విషయంలో 40 శాతం సాధారణ కాన్పు తప్పనిసరిగా జరగాలని ఆ దిశగా వైద్యులు కృషి చేయాలన్నారు.

పదవీ విరమణ పొందిన వైద్యులు సాధారణ కాన్పుల సంఖ్యను పెంచేందుకు యువ వైద్యులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ కోరారు.

ఈ సమీక్ష సమావేశంలో వైద్యాధికారి మహేందర్ ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు sugunakar రాజు ఉప వైద్యాధికారి సుధీర్ కరుణశ్రీ ప్రైవేటు వైద్యులు రాజమౌళి విజయలక్ష్మి స్వప్న ప్రోగ్రాం అధికారి అశోక్ రాము భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
——————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం జనగామ వారిచే జారీ చేయడమైనది.

Share This Post