ప్రచురణార్థం—-1

తేదీ.19.5.2022

ప్రభుత్వ లక్ష్యాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ధ

కట్టుదిట్టంగా 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు యూనిట్ల గ్రౌండింగ్ క్షేత్రస్థాయి పరిశీలన

ప్రతి నియోజకవర్గ పరిధిలో 1500 మందికి దళిత బందు అమలు

జూన్ 3 నుంచి 15 రోజుల పాటు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలు తీరుపై క్షేత్రస్థాయి అధికారులతో జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

జగిత్యాల మే 19:- ప్రభుత్వ లక్ష్యాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన మన ఊరు మన బడి, ధాన్యం కొనుగోలు, దళిత బంధు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జూమ్ ద్వారా గురువారం కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.

మన ఊరు మనబడి కార్యక్రమం కింద మొదటి దశలో 274 పాఠశాలలు ఎంపికయ్యాయని, వాటిలో 206 పాఠశాలల ప్రాజెక్టుల తయారు చేశామని , 65 పాఠశాలల తీర్మానాలు పూర్తిచేసుకుని పనుల గ్రౌండింగ్ కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు. 66 పాఠశాలల ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు చేయాలని సూచిస్తూ ఏఈలకు పంపామని తెలిపారు. జిల్లాలో 65 పాఠశాలల పనుల గ్రౌండింగ్ వెంటనే పూర్తి చేయాలని, పెండింగ్ అంశాలు పూర్తిచేసి పనుల గ్రౌండింగ్ కు సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

112 పాఠశాలలకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామని, మిగిలిన పాఠశాలల్లో ప్రతిపాదనలు త్వరగా సమర్పించాలని కలెక్టర్ సూచించారు. పరిపాలన అనుమతులు పూర్తయిన పాఠశాలల సాంకేతిక అనుమతులు అవసరమైన తీర్మానాలు పూర్తి చేసి గ్రౌండ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో 67 సెంటర్లలో 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో మే 21,2022 నాటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద పిల్లలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను మరోసారి ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ సమయంలో ప్రతి పరీక్ష కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ కింద ఎంపిడివో, తహసిల్దార్, సీనియర్ అధికారులను నియమించాలని, ఎక్కడా మాస్ కాపీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, ధాన్యం వివరాల టాబ్ ఎంట్రీలో జరుగుతున్న ఆలస్యానికి గల కారణాలను కలెక్టర్ మండలాల వారిగా అడిగి తెలుసుకున్నారు. 2 రోజులలో పూర్తిస్థాయిలో ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసే దిశగా ప్రత్యేక అధికారులు చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దాన్యం కొనుగోలు కేంద్రాలలో మధ్యాహ్నం సైతం కొనుగోలు జరిగే విధంగా షెడ్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో నాణ్యమైన ధాన్యం పూర్తి స్థాయిలో కోనుగోలు చేయాలని, నాణ్యత ప్రమాణాలు పరిశీలనలో, దాన్యం కొనుగోలు అంశంలో అలసత్వం వహిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇతర సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో 345 మంది లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాలో నగదు జమ చేసామని కలెక్టర్ తెలిపారు.
మండలాల వారీగా దళిత బందు యూనిట్ల గ్రౌండింగ్ పై క్షేత్రస్థాయి నివేదికలను ప్రత్యేక అధికారులు పరిశీలించి అందించాలని, వాటి ప్రకారం తదుపరి నిధులు విడుదల చేసేందుకు అనుమతులు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు

ట్రాక్టర్లు, రవాణా సెక్టార్ లో వివిధ వాహనాలు యూనిట్గా ఎంపిక చేసుకున్న 180 మంది లబ్ధిదారులకు వాహనాలను మే 21,2022 నుంచి అందించడానికి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేస్తామని, ఈ నెలాఖరు వరకు కనీసం 300 మంది పేర్లు ప్రతిపాదించాలని ఎమ్మెల్యేలను కోరాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో హరితహారం కింద 337 కిలోమీటర్ల మేర నిర్వహించిన మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పై సీఎం కేసీఆర్ సమావేశంలో ప్రశంసించారని కలెక్టర్ తెలిపారు. మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ లో ఉన్న గ్యాప్ లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 8వ విడత హరితహారం కార్యక్రమం లో మల్టీ లేయరు అవెన్యూ ప్లాంటేషన్ చేయడానికి వీలుగా 250 కిలోమీటర్ల పంచాయతీ ఆర్అండ్బి రోడ్లను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలోని గ్రామాల్లో నిర్మించిన స్మశాన వాటికలకు నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం అందే విధంగా 7 రోజుల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పల్లె ప్రగతి ప్రమాణాలను పరిశీలిస్తూ ప్రతి మండలంలో 3 ఉత్తమ గ్రామాలు, 3 వెనుకబడిన గ్రామాలు గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో వైకుంఠదామాల నిర్మాణం, అర్బన్ పార్క్ లో ఏర్పాటు, సమీకృత వెజ్ నాన్వెజ్ మార్కెట్లో నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో జరుగుతున్న అటవీ పునరుద్ధరణ పనులు పై సమగ్ర నివేదికను మండలాల వారీగా అందించాలని కలెక్టర్ అటవీ అధికారులకు కు సూచించారు.

ప్రతి మండలంలో 5 బృహత్ పల్లె ప్రకృతి వరాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూములు గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 18 మండలాల్లో 90 బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కు 71 ప్రాంతాలలో అవసరమైన భూమి గుర్తించామని, మిగిలిన 19 వనాల ఏర్పాటుకి భూములు గుర్తించాలని ఆయన ఆదేశించారు.

గ్రామాలు ,పట్టణాలలో ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో పారిశుద్ధ్య బాధ్యతలను స్థానిక సంస్థలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న మంచి నీటి ట్యాంకులు పూర్తిస్థాయిలో శుభ్రం చేసే దిశగా మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు గ్రీన్ పెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ నుండి ఆదాయం సంపాదించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

యువకుల శారీరక మానసిక ఎదుగుదల కోసం ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం 1 ఎకరం స్థలం ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలను జియో టాకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, పట్టణ ప్రగతి కోసం అవసరమైన నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్ బి.ఎస్. లత , ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి, మండల ప్రత్యేక అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

ప్రచురణార్థం----1 తేదీ.19.5.2022 ప్రభుత్వ లక్ష్యాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ధ కట్టుదిట్టంగా 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు యూనిట్ల గ్రౌండింగ్ క్షేత్రస్థాయి పరిశీలన ప్రతి నియోజకవర్గ పరిధిలో 1500 మందికి దళిత బందు అమలు జూన్ 3 నుంచి 15 రోజుల పాటు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలు తీరుపై క్షేత్రస్థాయి అధికారులతో జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జగిత్యాల మే 19:- ప్రభుత్వ లక్ష్యాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన మన ఊరు మన బడి, ధాన్యం కొనుగోలు, దళిత బంధు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జూమ్ ద్వారా గురువారం కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద మొదటి దశలో 274 పాఠశాలలు ఎంపికయ్యాయని, వాటిలో 206 పాఠశాలల ప్రాజెక్టుల తయారు చేశామని , 65 పాఠశాలల తీర్మానాలు పూర్తిచేసుకుని పనుల గ్రౌండింగ్ కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు. 66 పాఠశాలల ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు చేయాలని సూచిస్తూ ఏఈలకు పంపామని తెలిపారు. జిల్లాలో 65 పాఠశాలల పనుల గ్రౌండింగ్ వెంటనే పూర్తి చేయాలని, పెండింగ్ అంశాలు పూర్తిచేసి పనుల గ్రౌండింగ్ కు సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  112 పాఠశాలలకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామని, మిగిలిన పాఠశాలల్లో ప్రతిపాదనలు త్వరగా సమర్పించాలని కలెక్టర్ సూచించారు. పరిపాలన అనుమతులు పూర్తయిన పాఠశాలల సాంకేతిక అనుమతులు అవసరమైన తీర్మానాలు పూర్తి చేసి గ్రౌండ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.  జిల్లాలో 67 సెంటర్లలో 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో మే 21,2022 నాటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద పిల్లలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను మరోసారి ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ సమయంలో ప్రతి పరీక్ష కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ కింద ఎంపిడివో, తహసిల్దార్, సీనియర్ అధికారులను నియమించాలని, ఎక్కడా మాస్ కాపీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, ధాన్యం వివరాల టాబ్ ఎంట్రీలో జరుగుతున్న ఆలస్యానికి గల కారణాలను కలెక్టర్ మండలాల వారిగా అడిగి తెలుసుకున్నారు. 2 రోజులలో పూర్తిస్థాయిలో ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసే దిశగా ప్రత్యేక అధికారులు చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దాన్యం కొనుగోలు కేంద్రాలలో మధ్యాహ్నం సైతం కొనుగోలు జరిగే విధంగా షెడ్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో నాణ్యమైన ధాన్యం పూర్తి స్థాయిలో కోనుగోలు చేయాలని, నాణ్యత ప్రమాణాలు పరిశీలనలో, దాన్యం కొనుగోలు అంశంలో అలసత్వం వహిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇతర సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో 345 మంది లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాలో నగదు జమ చేసామని కలెక్టర్ తెలిపారు. మండలాల వారీగా దళిత బందు యూనిట్ల గ్రౌండింగ్ పై క్షేత్రస్థాయి నివేదికలను ప్రత్యేక అధికారులు పరిశీలించి అందించాలని, వాటి ప్రకారం తదుపరి నిధులు విడుదల చేసేందుకు అనుమతులు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు  ట్రాక్టర్లు, రవాణా సెక్టార్ లో వివిధ వాహనాలు యూనిట్గా ఎంపిక చేసుకున్న 180 మంది లబ్ధిదారులకు వాహనాలను మే 21,2022 నుంచి అందించడానికి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేస్తామని, ఈ నెలాఖరు వరకు కనీసం 300 మంది పేర్లు ప్రతిపాదించాలని ఎమ్మెల్యేలను కోరాలని కలెక్టర్ సూచించారు.  జిల్లాలో హరితహారం కింద 337 కిలోమీటర్ల మేర నిర్వహించిన మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పై సీఎం కేసీఆర్ సమావేశంలో ప్రశంసించారని కలెక్టర్ తెలిపారు. మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ లో ఉన్న గ్యాప్ లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 8వ విడత హరితహారం కార్యక్రమం లో మల్టీ లేయరు అవెన్యూ ప్లాంటేషన్ చేయడానికి వీలుగా 250 కిలోమీటర్ల పంచాయతీ ఆర్అండ్బి రోడ్లను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.  జిల్లాలోని గ్రామాల్లో నిర్మించిన స్మశాన వాటికలకు నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం అందే విధంగా 7 రోజుల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పల్లె ప్రగతి ప్రమాణాలను పరిశీలిస్తూ ప్రతి మండలంలో 3 ఉత్తమ గ్రామాలు, 3 వెనుకబడిన గ్రామాలు గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.  జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో వైకుంఠదామాల నిర్మాణం, అర్బన్ పార్క్ లో ఏర్పాటు, సమీకృత వెజ్ నాన్వెజ్ మార్కెట్లో నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో జరుగుతున్న అటవీ పునరుద్ధరణ పనులు పై సమగ్ర నివేదికను మండలాల వారీగా అందించాలని కలెక్టర్ అటవీ అధికారులకు కు సూచించారు.  ప్రతి మండలంలో 5 బృహత్ పల్లె ప్రకృతి వరాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూములు గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 18 మండలాల్లో 90 బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కు 71 ప్రాంతాలలో అవసరమైన భూమి గుర్తించామని, మిగిలిన 19 వనాల ఏర్పాటుకి భూములు గుర్తించాలని ఆయన ఆదేశించారు.  గ్రామాలు ,పట్టణాలలో ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో పారిశుద్ధ్య బాధ్యతలను స్థానిక సంస్థలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న మంచి నీటి ట్యాంకులు పూర్తిస్థాయిలో శుభ్రం చేసే దిశగా మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు గ్రీన్ పెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ నుండి ఆదాయం సంపాదించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. యువకుల శారీరక మానసిక ఎదుగుదల కోసం ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం 1 ఎకరం స్థలం ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలను జియో టాకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, పట్టణ ప్రగతి కోసం అవసరమైన నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్. లత , ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి, మండల ప్రత్యేక అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది
ప్రభుత్వ లక్ష్యాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post