పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక

పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక

కురవి,
మహబూబాబాద్ జిల్లా, మే -24:

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శశాంక తనిఖీ చేశారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక కురవి మండల కేంద్రంలోని తెలంగాణ అల్పసంఖ్యాకుల గురుకుల బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, త్రాగునీరు అందించాలని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి అవసరం మేరకు వైద్య సేవలు అందించి ఓ.ఆర్.ఎస్. అందించాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలో వచ్చే సందర్భంలో విద్యార్థులను తనిఖీ చేయాలని తెలిపారు

పరీక్షా కేంద్రంలో మొత్తం ఈ రోజు 156 మంది పరీక్ష రాయవలసి ఉండగా, 155 మంది హాజరైనారు అని, ఒకరు గైర్హాజరు అయ్యారని అధికారులు కలెక్టర్ కు వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి ఎం.డి. అబ్దుల్ హై, చీఫ్ సూపరింటెండెంట్ నరసింహ రెడ్డి, డిపార్ట్మెంట్ అధికారి రాందాస్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post