4687.92 కోట్లతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక

4687.92 కోట్లతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక

వ్యవసాయ, మార్కెటింగ్ , టర్మ్ లోన్స్ రంగాలకు 3255.61 కోట్లు

సూక్ష్మ , చిన్న, మధ్య తరగతి సంస్థలకు 992.50 కోట్లు

విద్యా రుణాలు 27 కోట్లు

హౌసింగ్ లోన్స్ 129.15 కోట్లు

( ప్రాధాన్యత రంగాలకు 4423.92 కోట్లు
ప్రాధాన్యతలేని రంగాలకు 264.00 కోట్లు )

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

2022 – 23 ఆర్థిక సంవత్సరానికి కోట్లతో 4687.92 కోట్లుతో వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జరిగిన డి సి సి/ డి ఎల్ ఆర్ సి సమావేశంలో కలెక్టర్ పాల్గొని 2022–23 వార్షిక రుణ ప్రణాళిక ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం వాణిజ్యం, విద్య,గృహ రుణాలు మౌలిక సదుపాయాలు పునరుత్పాదక రంగాలకు 4423.92 కోట్లు, ప్రాధాన్యత లేని రంగాలకు264 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం 204641 మంది రైతులకు2193.54 కోట్ల మేరకు రుణాలు ఇవ్వనున్నట్లు, వ్యవసాయానికి టర్మ్ లోన్ కింద 15511 మందికి 327.31 కోట్లు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అన్నారు. వ్యవసాయం తోపాటు అనుబంధ రంగాలకు సంబంధించి 9558 రైతులకురూ.188.60 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు 972 మంది రైతులకు74.35 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలకు 3372 రైతులకు471.81 కోట్ల రూపాయలు, సూక్ష్మ సంస్థలకు18063 యూనిట్లకు 361.25 కోట్లు, చిన్న సంస్థలకు 13273 యూనిట్స్ కు 597.50 కోట్లు, మధ్యతరగతి సంస్థలకు 101 యూనిట్లకు 33.75 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. విద్యారుణాలు కింద553 మందికి 27 కోట్లు, గృహ రుణాల కింద 1299 మందికి129.15 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కోసం 418 యూనిట్లకు16.50 కోట్లు, పునరుత్పాదక శక్తి క్రింద173 యూనిట్లకు 3.16 కోట్లు ఇతర ప్రాధాన్యతా లేని రంగాలకు 4423 మందికి 264 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. ఆయా రంగాలకు కేటాయించిన రుణాలు త్వరితగతిన మంజూరు చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు

     ఈ సమావేశంలో లీడ్ డిస్టిక్ మేమేనేజర్ టీవీ సీతా రామాంజనేయులు, నాబార్డ్ ఏజీఎం పి. అనంత్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మనోహర్ రావు,
బ్యాంకర్స్,తదితరులు పాల్గొన్నారు.

Share This Post