ప్రెస్ రిలీజ్.
తేది 27. 5 .2022
ములుగు జిల్లా.

*పదవ తరగతి పరీక్షా కేంద్రం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*

*మండల ప్రజాపరిషత్, తాహసిల్దార్ కార్యాలయాలను తనిఖీ చేసిన రికార్డులను భద్రపరచాలి జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య*

0 0 0 0

పదవ తరగతి పరీక్షా కేంద్రoను, మండల ప్రజాపరిషత్, తాహసిల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య శుక్రవారం తనిఖీ చేశారు.

గోవిందరావు పేట మండలంలోని పస్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి పదో తరగతి పరీక్ష కేంద్రము లో విద్యార్థులు 5 వ రోజు సైన్స్ పేపర్ పరీక్షా వ్రాయు విధానము పరిశీలించారు. పరీక్ష కు హాజరైన విద్యార్థుల వివరాలను జిల్లా కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రo వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి
ఆసౌకర్యాలు కలగకుండా చూడాలని, వేసవి దృష్టా త్రాగు నీరు అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. పరీక్షల నిర్వహణ సమయంలో ఎక్కడా మాస్ కాపీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్ ఎస్ సి పరీక్షా సెంటర్ ఇంచార్జీ ని కలెక్టర్ ఆదేశించారు.

హైస్కూలు ఆవరణలో గ్రామీణ ప్రాంత పిల్లలు మరియు యువకుల శారీరకంగా మానసికంగా ఎదుగుదల కోసం క్రీడా మైదానం ఏర్పాటుకు ఖాళీ స్థలమును పరిశీలించారు.

అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయం సందర్శించి కార్యాలయ రికార్డు గదిని తనఖి చేసారు. రికార్డులు ఎప్పటి కప్పుడు రిజిస్టర్ లో సక్రమంగా నమోదు చేసి బద్రపర్చలన్నారు.

అనంతరం తాహసిల్దార్ కార్యాలయం సందర్శించి రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. కార్యాలయ కాంపౌండ్ నిర్మాణం, కార్యాలయం ఆవరణంలో సిసి రోడ్డు ఏర్పాటుకు తహసిల్దార్ ను ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమములో తహసిల్దార్ రాజ్ కుమార్, ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, చీఫ్ సూపరింటెండెంట్ కేశవరావు, ఎగ్సమినేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post