మే 30న అంగారక టౌన్ షిప్ లో ప్రీ బిడ్ సమావేశం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్


మే 30న అంగారక టౌన్ షిప్ లో ప్రీ బిడ్ సమావేశం

అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

00000

నుస్తులాపూర్ అంగారక టౌన్ షిప్ లో సందేహాల నివృత్తి కోసం ప్రీ బిడ్ సమావేశం ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.

తిమ్మాపూర్ మండలం సుభాష్‌నగర్ (రామకృష్ణ కాలనీ నుస్తులాపూర్) హైదరాబాద్ హైవే కు దాదాపు 500 మీటర్ల దూరంలో డి టి సి పి చే ఆమోదింపబడి, సుడా ద్వారా అభివృద్ధి చేయబడుతున్న లేఅవుట్ లో మొదటి విడతగా 237 ప్లాట్లు( మొత్తం 819) వేలం ద్వారా అమ్మకానికి అందుబాటులో కలవని తెలిపారు.  మే 30 న సాయంత్రం 4.00 గంటలకు నుస్తులాపూర్ రైతు వేదికలో నిర్వహించు ప్రీ బిడ్ సమావేశంలో సందేహాల నివృత్తి కోసం ప్రజలు హాజరు కావాలని ఆమె తెలిపారు.

Share This Post