90 శాతం చేరువగా వ్యాక్సినేషన్

ప్రచురణార్థం

90 శాతం చేరువగా వ్యాక్సినేషన్

మహబూబాబాద్ నవంబర్ 17

జిల్లాలో ఐదు లక్షలకు పైగా వ్యాక్సినేషన్ పూర్తిచేసి 90 శాతానికి చేరువగా ఉన్నందుకు జిల్లా కలెక్టర్ శశాంక అభినందించారు.

బుధవారం కలెక్టర్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ 100% సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

మండలాలలో గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల నివేదిక ఉందని ఈ నివేదిక ఆధారంగా వ్యాక్సినేషన్ పరిశీలించుకోవాలి అన్నారు కురవి బయ్యారం కేసముద్రం తదితర మండలాలు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలన్నారు.
అదేవిధంగా రెండవ డోసు వ్యాక్సినేషన్ ప్రగతి కూడా సాధించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జడ్పీ సీఈఓ రమాదేవి వైద్యాధికారులు హరీష్ రాజు అంబరీష విక్రమ్ బిందు శ్రీ తదితరులు పాల్గొన్నారు
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post