బృహత్ పట్టణ ప్రకృతి వనం లో మొక్కల ఎదుగుదలకు జాగ్రత్తలు తీసుకోవాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

బృహత్ పట్టణ ప్రకృతి వనం లో మొక్కల ఎదుగుదలకు జాగ్రత్తలు తీసుకోవాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

బృహత్ పట్టణ ప్రకృతి వనం లో మొక్కల ఎదుగుదలకు జాగ్రత్తలు తీసుకోవాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

తొర్రూరు,
మహబూబాబాద్, జూన్ -06:

బృహత్ పట్టణ ప్రకృతి వనం లో మొక్కల ఎదుగుదలకు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక 5వ వార్డ్ దుబ్బ తండా లోనీ బృహత్ పట్టణ ప్రకృతి వనం ను సందర్శించి పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మొక్కల చుట్టూ పెరిగిన గడ్డి తొలగించాలని, సాసరింగ్ చేయాలని, మొక్కల వద్ద రెండు బకెట్ ల నీరు నిల్వ ఉండే విధంగా చూసి, మొక్కల క్రింద పెరుగుతున్న కొమ్మ రెమ్మలని తొలగిస్తే మొక్క ఏపుగా పెరుగుటకు అవకాశం ఉంటుందని, జీవామృతం వేయాలని, 5 ఎకరాలలో 4 ఎకరాల్లో బృహత్ పట్టణ ప్రకృతి వనం, మిగిలిన ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా క్రీడా ప్రాంగణం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రం చంద్రయ్య, కౌన్సిలర్ సునీత, మునిసిపల్ కమిషనర్ గుండె బాబు, డి.ఆర్.డి.ఓ. సన్యాసయ్య, ఆర్డీవో రమేష్, డిప్యూటీ సి. ఈ. ఓ. నర్మద, పి.హెచ్.ఈ.ఈ., మునిసిపల్ ఈ. ఈ. రంజిత్, మిషన్ భగీరథ డి. ఈ. వెంకటేశ్వర రెడ్డి, ఏ. ఈ. శ్రీనివాస్, తహసిల్దార్ రాఘవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post