పత్రిక ప్రకటన

తేదీ : 14–08–2022

ఈనెల 16న సామూహిక జాతీయ గీతాలాపన ప్రతిచోటా నిర్వహించాలి,
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఆరోజు ఉదయం 11.30 గంటలకు పాఠశాలల్లో బెల్స్, ఇతర కూడళ్ళు తదితర ప్రదేశాల్లో సైరన్ మోగేలా ఏర్పాట్లు చేయాలని అందులో జాతీయ గీతాలాపన రాగానే ఎక్కడి వారు అక్కడే నిలబడి సెల్యూట్ చేస్తూ ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాన్ని ఆలపించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రతి గ్రామం, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లో నిర్వహించాల్సిందిగా కలెక్టర్ హరీశ్ సూచించారు.

 

 

Share This Post