ఆహ్లాదాన్ని పంచిన ఎట్ హోమ్

ఆహ్లాదాన్ని పంచిన ఎట్ హోమ్

స్వతంత్ర భారత దినోత్సవం ను పురస్కరించుకుని సోమవారం IDOC కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎట్‌హోమ్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఎట్‌హోమ్‌ కార్యక్రమం అద్యాంతం ఆహ్లాదభరిత వాతావరణంలో ఉల్లాసంగా సాగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు లు , ప్రభుత్వ జిల్లా అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన అనంతరం జిల్లా కలెక్టర్,ఎస్పీ లు విద్యార్థులకు మెమెంటో లు అందించీ అభినందించారు

.

Share This Post