నాలుగు KGBV లకు డార్మేటరీలు మంజూరు-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

నాలుగు KGBV లకు డార్మేటరీలు మంజూరు

-ప్రతిపాదనలు సిద్ధం చేయండి

-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
——————————

చందుర్తి, బోయినిపల్లి, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లోనీ KGBV లు, ఎల్లారెడ్డి పేట మండలంలోని ఆల్మాస్ పూర్ గ్రామంలోని
KGBV లకు విద్యార్థినీ ల సౌకర్యార్థం ఒక్కోటి చొప్పున అదనంగా డార్మేటరీలు మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలోనీ కేజీబీవీ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కేజీబీవీలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, భౌతిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు .

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కేజీబీవీలో దోమల బెడద లేకుండా మెస్ లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
అట్లాగే విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. కేజీబీవీల లో ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేపడతామన్నారు.
అలాగే అన్ని కేజీబీవీలకు కామన్ కలర్ ఉండేలా చూస్తామన్నారు. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టి ఎస్ ఈ డబ్ల్యు ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విరూపాక్ష ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న డే కేర్ సెంటర్ ఫర్ సీనియర్ సిటిజెన్స్ ను పంచాయతీరాజ్ కార్యనిర్వాక ఇంజనీరింగ్ సూర్యప్రకాష్ ,మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి చిరంజీవితో కలిసి పరిశీలించారు.
ఇప్పటికే డేకేర్ సెంటర్ కు ఆక్టివిటీ రూమ్, రీడింగ్ రూమ్, ఫిజియోథెరపీ రూమ్, డార్మెటరీ, కిచెన్ హాల్ ,యోగా సెంటర్, ల్యాండ్ స్కేపింగ్, టాయిలెట్ ఫెసిలిటీస్ ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినందున నెలాఖరులోగా వీటిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేస్తున్న మోడల్ క్రీడా ప్రాంగణం ఏర్పాటు పురోగతి గురించి ఎంపీడీవో ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా దాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
——————————

 

Share This Post