జిల్లా ఆసుపత్రికి సంబంధించిన మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

జిల్లా ఆసుపత్రికి సంబంధించిన మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

—–

జిల్లా ఆసుపత్రికి అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళిధర్ రావును ఆదేశించారు.

బుధవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు, వైద్యాధికారులు, tsmidc ఇంజనీర్ ల తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

జిల్లా ఆస్పత్రిలో ఏమైనా అంతర్గతంగా మరమ్మతులు చేపట్టాల్సి ఉంటే వెంటనే వాటిని చేపట్టాలన్నారు. ఆసుపత్రి భవనంలో ఎక్కడైనా వర్షం నీరు లీకేజ్ అవుతుంటే వెంటనే వాటర్ ప్రూఫ్ చేయాలని సూచించారు.
ఇటీవల కొత్తగా ప్రారంభించిన సిక్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ ను బాగా అభివృద్ధి పరచాలని సూచించారు.

జిల్లా కేంద్రం కు మెడికల్ కళాశాల మంజూరు కావాలంటే మెడికల్ కౌన్సిల్ కు 450 బెడ్లను చూపెట్టాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకోసం జిల్లా ఆసుపత్రి లో ఇప్పటికే ఉన్న బెడ్ లకు అదనంగా 80 పడకల సామర్ధ్యం గల ఫ్లోర్ ను నిర్మించాలని అన్నారు.

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మరమ్మతుల చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

——————————

Share This Post