పత్రిక ప్రకటన

తేదీ : 12–09–2022

ప్రజావాణి ఫిర్యాదులకు అధికారులు తక్షణం స్పందించాలి,
ప్రజావాణిలో ప్రజల సమస్యలు తెలుసుకొన్న జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో 39 వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు
ప్రజావాణిలో ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని దీని కోసం ప్రజలు అందించిన విజ్ఞప్తులను ఏమాత్రం పెండింగ్లో ఉంచకుండా వేగవంతంగా అవసరమైన చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని మేడ్చల్ –- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్ అన్నారు. సోమవారం షామీర్పేటలోని కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి ప్రజల నుంచి వచ్చిన 39 వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎప్పటికప్పుడే పరిష్కరించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని
అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post