_ పత్రికా ప్రకటన జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా గారి ఆదేశానుసారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ, జిల్లాలోని యువజన సంఘాలు మరియు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) భువనగిరి నందు తేదీ 26 ఏప్రిల్ 2022 న ఉదయం 9 గంటలకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కే ధనంజనేయులు గారు ఓక ప్రకనలో తెలిపారు.

ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యం తలసీమియా వ్యాధి గ్రస్తులకు ప్రతి 15 నుండి 21 రోజుల లోపు బ్లడ్ ను అందించాలి లేకపోతే వారి యొక్క జీవన గమనం ముందుకు సాగదు దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ, జిల్లా లోని యువజన మరియు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు తలసేమియా వ్యాధి గ్రస్తులకు వారి జీవనానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇట్టి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు లో అర్హత కలిగిన బ్లడ్ డోనర్స్ హాజరై వారి రక్తాన్ని దానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జిల్లా నుంచి ఎక్కువ మంది అర్హత కలిగిన 18 నుండి 55 సంవత్సరాలు కలిగిన యువత అధిక సంఖ్యలో పాల్గొని మరియు బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము.

Share This Post