ADB DPRO – పల్లె ప్రగతి కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జూన్ 3 నుండి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పల్లె ప్రగతి కార్యక్రమం పై నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యదర్శి మాట్లాడుతూ, జూన్ 3 నుండి 15 రోజుల పాటు నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు. కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, హరితహారంలో మొక్కలు నాటే స్థలాలను గుర్తించడం, విద్యుత్ సమస్యలు, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గత పల్లె ప్రగతి కార్యక్రమంలో సాధించిన అద్భుత విజయాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే జూన్ 3 నుండి ప్రారంభం కానున్న ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతానికి చర్యలు తీసుకుంటాంమన్నారు. గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతతో పాటు అంతర్గత, సీసీ రోడ్లు, రహదారుల వెంట మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. వైకుంఠ దమాలలో నీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా తో పాటు లూస్ వైర్లు, వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేయడం వంటి, ఇతర విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మండలానికి రెండు చొప్పున 34 తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను జూన్ 2 న ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హరితహారం లో భాగంగా చెరువులు, కాలువలు, కుంటలు, రహదారుల వెంట విరివిగా మొక్కలను నాటేందుకు ప్రణాళికలు తయారుచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post