ASF : అర్హత గల ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు అందేలా చర్యలు: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్


ఆర్. ఓ. ఎఫ్. ఆర్. చట్టం ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హత గల గిరిజనులకు పోడు భూములు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయితీ కార్యదర్శులతో పోడు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారి జాబితాను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుతో పాటు 2 ఆధారాలు, 2005లో నివసిస్తున్నట్లు తప్పకుండా దరఖాస్తుకు జత చేయాలని, అర్హులైన వారు వివరాలు కచ్చితంగా జాబితాలో ఉండే విధంగా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రాజస్వ మండల అధికారి రాజేశ్వర్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి మణెమ్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post