ASF : అర్హత గల ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

 


జిల్లాలోని గిరిజన సంక్షేమ, మైనారిటీ, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖల పరిధితో పాటు ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలలలో విద్యనుభ్యసిస్తున్న అర్హత గల ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి జిల్లా అధికారులు, ప్రైవేటు విద్యాసంస్థల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులలో అర్హత గల ప్రతి ఒక్కరికి ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని, ఫిబ్రవరి 23వ తేదీలోగా విద్యార్థుల ఆధార్ కార్డులను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు, నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హత గల ప్రతి విద్యార్థికి ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని, అర్హత గల ఏ ఒక్కరికి ఉపకార వేతనం అందకపోయినా సంబంధించిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పదవ తరగతి వార్షిక పరీక్షలలో ప్రతి విద్యార్థి 100 శాతం జి-1 ఉత్తీర్ణత సాధించేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలని, పదవ తరగతి అనంతరం ఇంటర్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఇంటర్మీడియట్ అనంతరం విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఎంసెట్ తో పాటు ఇతర రంగాలలో శిక్షణ అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు మణెమ్మ, జిల్లా అధికారులు, ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post