ఓటర్ జాబితా తయారీ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్ర ప్రాముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి రెండవ ఓటరు జాబితా సవరణపై వివిధ పార్టీల ప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలు రాజకీయ పార్టీల పాత్ర ప్రాముఖ్యంగా ఉంటుందని తెలిపారు ఈనెల 25వ తేదీ నుండి జూన్ 23వ తేదీ వరకు బిఎల్వోలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ నమోదు ప్రక్రియ చేపడతారని తెలిపారు. ఇదే సందర్భంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఓటరు జాబితా తయారీలో ప్రత్యేక పాత్ర పోషించాలన్నారు. పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉన్న ఓటర్లను గుర్తించి దగ్గర్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వారి పేరు నమోదు కోసం అవసరమైన దరఖాస్తును సమర్పించేలా రాజకీయ పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సెప్టెంబర్ నెలలో రెండు శనివారాలు, రెండు ఆదివారాలు ఓటరు నమోదు ప్రక్రియ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో పార్టీలో ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించి నాణ్యమైన ఓటర్ జాబితా తయారయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపర్డెంట్ ప్రమోద్, ఎలక్షన్ డిటి జితేందర్, అన్ని పార్టీల ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కొమరం భీమ్ ఆసిఫాబాద్ చే జారీచేబడినది