ASF : ఓటు హక్కు ఆవశ్యకత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ఓటు హక్కు ఆవశ్యకతను, ఓటరు శక్తిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి ఆదివాసి సంఘాల ప్రతినిధులతో ఓటు నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ఓటరు పారదర్శకమైన, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ఓటు హక్కు ప్రధానమైనదని, ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవడంతో పాటు 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి తమ ఓటు వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆదివాసీలలో కొలాం, తోటి, పటేళ్లు, రాయి సెంటర్, సర్మెడీలు, ఇతర ఇతర సంబంధిత వారందరు తమ ఓటు హక్కు నమోదు చేసుకుని, ఎన్నికల సమయంలో ఓటు వినియోగించుకుని విధంగా ఆదివాసి సంఘాల నాయకులు అవగాహన కల్పిస్తూ కృషి చేయాలని తెలిపారు. ప్రాథమిక హక్కుగా పరిగణించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ పొందే విధంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమంలో ఈనెల 8వ తేదీన ఓటు నమోదుకు ఆఖరి తేదీగా నిర్ణయించినందున అర్హత గల వారందరూ తమ ఓటును నమోదు చేసుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, ఆదివాసి సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post