ASF : జిల్లాలో మన ఊరు మనబడి మొదటి పాఠశాల ప్రారంభం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

 

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా ఎంపికైన పాఠశాలలలో జిల్లాలో పనులు పూర్తయిన ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తేలే గూడ గ్రామంలో 32 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, అసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా జిల్లాలో 251 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, అన్ని పనులు పూర్తి చేసుకొని ఈరోజు తేలేగూడ గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పాఠశాలలో బెంచీలు, వంటశాల, భోజనశాల, ప్రహరీ గోడ, అదనపు గదులు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా ఇతర అన్ని వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యా రంగ అభివృద్ధి కోసం సమూల మార్పులలో భాగంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించడం చాలా సంతోషంగా ఉందని, తేలేగూడ పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉన్నారని, ఇందులో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందని, రాష్ట్రంలోని విద్యార్థుల శ్రేయస్సు దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, పంచాయతీరాజ్ శాఖ ఈ ఈ, జెడ్పిటిసి నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post