తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ 88వ జయంతి వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, జిల్లా రెవెన్యూ అధికారి సురేష్ తో కలిసి పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1969 నుండి నీళ్లు, నిధులు, నియామకాలు బంగారు తెలంగాణతోనే సాధ్యమని ఉద్యమానికి రూపకల్పన చేశారని అన్నారు. జయశంకర్ సార్ ఆశించినట్టుగానే స్వయంపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, సకల జనుల అభ్యున్నతిని సాధిస్తుందని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.