ASF : తెలంగాణ సమాజానికి గర్వకారణం కొండా లక్ష్మణ్ బాపూజీ : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గర్వ కారకుడని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన 107వ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలల్లో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో ఆయన పాల్గొన్నారు. మొదట బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లాకు చెందిన వాడు కావడం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. 1915లో వాంకిడి మండలంలో జన్మించిన బాపూజీ పదో తరగతి వరకు ఆసిఫాబాద్ లో చదివి అనంతరం న్యాయ విద్యను పూర్తి చేయడం జరిగిందన్నారు. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మొట్టమొదట గుర్తించిన వ్యక్తి బాపూజీ అని ప్రత్యేక తెలంగాణ సాధనలో బాపూజీ కృషి మరువలేనిదని పేర్కొన్నారు. యావత్తు తెలంగాణ బాపూజీకి రుణపడి ఉండాలని పిలుపునిచ్చారు. నిజాం ప్రభువుల కబంధహస్తాల నుండి తెలంగాణను విముక్తి చేయడానికి బాపూజీ ఆ రోజులలోనే పోరాడాడని గుర్తు చేశారు. బాపూజీ జయంతి వేడుకలలో తాను కూడా భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్వో సురేశ్ కుమార్, డిపివో రమేశ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ మల్లికార్జున్, పిఎసిఎస్ చైర్మెన్ అలీ బిన్ అహమద్, వివిధ సంఘాల నాయకులు అశోక్, రూప్నర్ రమేశ్, శంకర్, ఇరుకుల్ల మంగలు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబాధాల శాఖ అధికారి-కుమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post