slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

ASF : ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల రక్షణ దిశగా పోలీసు శాఖ పటిష్టం : రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ – Information and Public Relations Department, Government of Telangana

ASF : ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల రక్షణ దిశగా పోలీసు శాఖ పటిష్టం : రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ

రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల రక్షణ దిశగా ప్రభుత్వం పోలీసు శాఖను పటిష్ట పరచడం జరుగుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, డి. జి. పి. మహేందర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్. పి. సురేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ శాసనసభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జిల్లా అధికారులతో కలిసి పర్యటించారు. 12 కోట్ల 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన జిల్లాలోని కాగజ్నగర్ రూరల్, రెబ్బెన, వాంకిడి, పెంచికల్ పేట, చింతల మానేపల్లి, కౌటాల పోలీస్ స్టేషన్లు, సి.ఐ. కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి కోనేరు కోనప్ప నిత్యాన్న సత్యాన్ని సందర్శించారు. కాగజ్ నగర్ మండలంలోని చింతగూడ గ్రామ సమీపంలో 36 కోట్ల రూపాయలతో నిర్మించిన బాలుర, బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించారు. వర్షాల కారణంగా ఇటీవల దెబ్బతిన్న అందవెల్లి వంతెనను పరిశీలించారు. ఈ వంతెన దెబ్బతినడంతో దహేగాం మండలంలోని 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా తాత్కాలిక ఏర్పాట్లు చేసి పునరుద్ధరించడం జరిగిందని, వంతెన పై పూర్తి నివేదిక అందిన తర్వాత మరమ్మత్తులు లేదా నూతన వంతెన నిర్మాణం పై పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల మాన, ప్రాణ రక్షణ కొరకు 10 లక్షల సి. సి. కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడానికి పోలీసు శాఖను పటిష్టం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పోలీసు శాఖకు అన్ని వసతులు కల్పించడం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన సమయంలో వెంటనే పోలీసు శాఖను అప్రమత్తం చేసే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందని, దేశంలోని తెలంగాణ పోలీస్ భేష్ అనిపించుకుంటున్నారని తెలిపారు. పోలీసు శాఖ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ చాలా బాగుందని అన్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక కెమెరాల ద్వారా రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని కనిపెట్టడం జరుగుతుందని, మహిళలు, యువతులు, బాలికల రక్షణ కొరకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని, ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎంతో గొప్పదని, 65 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి 8 సంవత్సరాల లో సాధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో జైనూరు, లింగాపూర్, సిర్పూర్ (యు) లలో నూతన పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణం ప్రభుత్వం 7 కోట్ల 50 లక్షల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే విద్యారంగంలో రాణించాలని, రాష్ట్రంలోని బాల బాలికలందరికి విద్యను అందించడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో దాదాపు 1000 కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పాఠశాలలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 220 గురుకుల పాఠశాలలు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు సిర్పూర్ కాగితపు మిల్లు అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారని, పూర్వ వైభవం తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతులు వ్యవసాయంపై మరింత మక్కువ చూపుతున్నారని అన్నారు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల తో పాటు ఒంటరి మహిళలకు సైతం పెన్షన్ సౌకర్యం కల్పించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. కాగజ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో ఏడు సంవత్సరాలుగా విద్యార్థులకు స్థానిక శాసనసభ్యులు కోనేరు కోనప్ప తన సొంత నిధులతో మధ్యాహ్న భోజన పథకం అందించడంతో పాటు ప్రతిరోజు అన్నదాన సత్రంలో 2 వేల మందికి మధ్యాహ్న భోజనం అందించడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post